Lala Bheemla: దీపావళి ముందుగానే తీసుకొచ్చిన పవన్‌ కళ్యాణ్‌..

By Aithagoni RajuFirst Published Nov 3, 2021, 8:02 PM IST
Highlights

 `భీమ్లా నాయక్‌` చిత్రంలోని మూడో పాట `లాలా భీమ్లా`ని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఆద్యంతం యాక్షన్‌ ఎలిమెంట్లతో సాగే ఈ సాంగ్‌ప్రోమో తెగ ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 
 

దీపావళి ముందుగానే వచ్చిందంటున్నారు పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan). ఆయ పెట్టిన బాంబులలకు సుమో లేచిపోయింది. ఇదంతా `భీమ్లా నాయక్‌`(Bheemla Nayak) చిత్రానికి సంబంధించిన మూడో పాట `లాలా భీమ్లా`(LalaBheemla) సాంగ్‌ ప్రోమోలో చోటు చేసుకుంది. Bheemla Nayak చిత్రంలోని మూడో పాట `లాలా భీమ్లా`ని బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఆద్యంతం యాక్షన్‌ ఎలిమెంట్లతో సాగే ఈ సాంగ్‌ప్రోమో తెగ ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

Pawan Kalyan, Rana హీరోలుగా `భీమ్లా నాయక్‌` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సాగర్‌ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ మాటలు, కథనం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి దీపావళి పండుగ గిఫ్ట్ వచ్చింది. సినిమాలోని మూడో పాట ప్రోమోని విడుదల చేశారు. `లాలా భీమ్లా` అంటూ సాగే సాంగ్‌ ప్రోమో విడుదల చేయగా, అది తెగ ఆకట్టుకుంటుంది. ఇందులో  నాగరాజు గారు హార్టీ కంగ్రాట్స్ లేషన్స్ అండి మీకు దీపావళి పండుగ 
ముందుగానే వచ్చేసింది హ్యాపీ దీపావళి` అంటూ కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరినో ఉద్దేశించి అనటం కనిపిస్తుంది.

అయితే ప్రోమోలో బాంబ్‌ పేలినప్పుడు రానా కూడా కనిపించడం విశేషం. ప్రోమో చివరిలో `లాలా భీమ్లా` పాట నవంబర్ 7 న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన `భీమ్లా నాయక్` పాత్ర తీరు, తెన్నులు. భీమ్లా నాయక్ దమ్ము, ధైర్యానికి అక్షర రూపంలా, కథానాయకుడి గొప్పదనాన్ని కరతలామలకం చేసేలా సాగిన గీతం, అలాగే విజయదశమి పర్వదినాన విడుదల అయిన `అంత ఇష్టమేందయ` పాట అభిమాన ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి.

వీటికి ముందు పవన్ కళ్యాణ్, రానా ప్రచార చిత్రాలు కూడా  సామాజిక మాధ్యమాలు వేదికగా సరికొత్త రికార్డు లను నమోదు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మిత మవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

related news: Lala bheemla lyrical:తగ్గేదేలే... ఆర్ ఆర్ ఆర్ కి ఎదురే... క్లారిటీ ఇచ్చిన భీమ్లా నాయక్

ఇక ఈ చిత్రాన్ని జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. అయితే `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా జనవరి 7న విడుదల కానున్న నేపథ్యంలో పవన్‌ సినిమా వాయిదా పడుతుందనే వార్తలొచ్చాయి. కానీ అందులో నిజం లేదని, రిలీజ్‌ డేట్‌ ఏమాత్రం మారడం లేదనే విషయాన్ని స్పష్టం చేసింది యూనిట్‌. సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉంటుందని తెలుస్తుంది.

also read: హాట్ సమ్మర్ లో మహేష్ 'సర్కారు వారి పాట'..కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

click me!