
టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ లను పోటాపోటీగా తెరకెక్కిస్తున్నారు. క్రిష్ 'ఎన్టీఆర్ బయోపిక్' పోటీగా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీస్తుంటే.. వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి పోటీగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను రూపొందిస్తున్నారు.
ఎన్టీఆర్ గుడిలో లింగాన్ని ఎత్తుకెళ్లాడు అంటూ ఇటీవల నాదెండ్ల భాస్కరరావు చేసిన ఆరోపణలతో సినిమా టీజర్ మొదలవుతుంది. ఆ తరువాత మొత్తం ఎన్టీఆర్ వాయిస్ తో టీజర్ ని నడిపించారు.
టీజర్ లో వర్మని, లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ తిడుతున్నట్లుగా వాయిస్ ఉంది. నీ వలనే మా అధికారాన్ని పోగుట్టుకున్నామంటూ ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతిని విమర్శించడం టీజర్ లో వినిపించారు.