'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్.. ఈసారి పక్కా: వర్మ!

Published : Mar 19, 2019, 10:09 AM IST
'లక్ష్మీస్ ఎన్టీఆర్' రిలీజ్.. ఈసారి పక్కా: వర్మ!

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికి రావడం లేదు. 

మార్చి 22న రిలీజ్ ఉంటుందని చిత్రబృందం ప్రకటించినప్పటికీ మరోసారి విడుదల వాయిదా పడింది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. కొందరు టీడీపీ కార్యకర్తలు సినిమా రిలీజ్ కాకుండా ఉండాలని ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేశారు.

మరోపక్క సెన్సార్ విషయంలో కూడా సమస్యలు ఎదురవుతున్నట్లు టాక్. ఈ క్రమంలో వర్మ సెన్సార్ బోర్డ్ తో చర్చలు జరిపి సినిమా విడుదల తేదీనీ మార్చి 29కి మార్చారు. ఈసారి సినిమా పక్కా విడుదలవుతుందని అంటున్నారు. త్వరలోనే కడపలో సినిమా బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నాడు.  
 

PREV
click me!

Recommended Stories

Demon Pavan Love Story: తాను ప్రేమిస్తే ఫ్రెండ్‌తో జంప్‌.. గుండె బరువెక్కించే డీమాన్‌ పవన్‌ ఫ్యామిలీ స్టోరీ
ఉపాసన డెలివరీ డేట్ ఎప్పుడో తెలుసా? రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి కాబోయేది ఎప్పుడంటే?