వర్మ రచ్చ చూశారా..?

Published : Mar 19, 2019, 09:34 AM IST
వర్మ రచ్చ చూశారా..?

సారాంశం

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ సినిమా విడుదలయ్యే వరకు అనుమానమే. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ సినిమా విడుదలయ్యే వరకు అనుమానమే. ఈ సినిమాను అడ్డుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు.

కానీ వర్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను చెప్పిన సమయానికి విడుదల చేస్తామని అంటున్నారు. బుధవారం నాడు సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. వారి నుండి ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమైతే.. ఆ సన్నివేశాలు తొలగించి సర్దుబాటు చేయడానికి ఒక్కరోజు సమయమే ఉంటుంది. 

ఈ లెక్కన చూసుకుంటే సినిమా వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. తాజాగా వర్మ.. ఎన్టీఆర్ పాపులర్ ఫోటోని మార్ఫింగ్ చేసి తన ఫోటో పెట్టుకున్నాడు. ఇది ఆయన అభిమానులు పంపారో లేక ఆయనే చేసుకున్నారో కానీ ఆ ఫోటోని షేర్ చేస్తూ.. ''ఎన్టీఆర్ లుక్ ఒకరిని పోలినట్టు ఉంది.. అతనెవరో తెలుసా..?'' అంటూ ఈ మార్ఫింగ్ ఫోటోకి క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

ఎన్టీఆర్ తో వర్మని పోల్చుకోవడంతో సోషల్ మీడియాలో కామెంట్లు ఓ రేంజ్ లో వస్తున్నాయి. మా కర్మ అంటూ ఎన్టీఆర్ అభిమానులు తల పట్టుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth: `నరసింహ` వెనుక రహస్యం, ఇన్నాళ్లకి బయటపెట్టిన సూపర్‌స్టార్‌ కూతురు.. నరసింహ 2 అప్‌ డేట్‌
Demon Pavan Love Story: తాను ప్రేమిస్తే ఫ్రెండ్‌తో జంప్‌.. గుండె బరువెక్కించే డీమాన్‌ పవన్‌ ఫ్యామిలీ స్టోరీ