దీప్తిని వదిలేసి షణ్ముఖ్‌కి సిరితో జోడి కట్టిన ఉమాదేవి.. ప్రియాంకని వెంటపడి కొట్టిన లోబో.. విశ్వ విన్నర్‌..

Published : Sep 16, 2021, 11:43 PM ISTUpdated : Sep 16, 2021, 11:49 PM IST
దీప్తిని వదిలేసి షణ్ముఖ్‌కి సిరితో జోడి కట్టిన ఉమాదేవి.. ప్రియాంకని వెంటపడి కొట్టిన లోబో.. విశ్వ విన్నర్‌..

సారాంశం

గురువారం ఎపిసోడ్‌ మొత్తం ఫన్‌ మూడ్‌లో సాగింది. ఇందులో స్వేత వర్మ బర్త్ డే జరిపారు. ఆమె కోసం బిగ్‌బాస్‌ ఛాక్లెట్‌ పంపించాడు. మరోవైపు వారి నాన్నతోని మాట్లాడించాడు బిగ్‌బాస్‌. దీంతోపాటు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో అనీ మాస్టర్‌, ప్రియాంక, విశ్వ, హమీద పోటీలో ఉన్నారు. 

బిగ్‌బాస్‌ 5 సీజన్‌  11వ రోజు గేమ్‌ ఫన్‌ మూడ్‌లోకి వెళ్లింది. ఫస్ట్ వీక్‌ నుంచి బుధవారం వరకు సీరియస్‌గా సాగింది. `దొంగలున్నారు జాగ్రత్త` టాస్క్ లో ఇంటి సభ్యులు మరీ రెచ్చిపోయారు. బూతులు తిట్టుకోవడమే కాదు, ఏకంగా కొట్టుకునే స్థాయికి చేరారు. కానీ దాన్నుంచి పెద్ద రిలీఫ్‌ని ఇచ్చాడు బిగ్‌బాస్‌. గురువారం ఎపిసోడ్‌ మొత్తం ఫన్‌ మూడ్‌లో సాగింది. ఇందులో స్వేత వర్మ బర్త్ డే జరిపారు. ఆమె కోసం బిగ్‌బాస్‌ ఛాక్లెట్‌ పంపించాడు. మరోవైపు వారి నాన్నతోని మాట్లాడించాడు బిగ్‌బాస్‌. 

దీంతోపాటు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇందులో అనీ మాస్టర్‌, ప్రియాంక, విశ్వ, హమీద పోటీలో ఉన్నారు. `కొడితే కొట్టాలిరా కొబ్బరి కాయ` టాస్క్ లో భాగంగా కొబ్బరి కాయలు కొట్టి ఈ నలుగురి ప్లాస్క్ లో ఆ వాటర్‌ని నింపాల్సి ఉంది. అందుకు ఇతర ఇంటి సభ్యులు సహకారం అందించారు. ఎవరి ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు. ఈ టాస్క్ లో చాలా వరకు విశ్వకి సపోర్ట్ చేశారు. ఆయన ప్లాస్క్ త్వరగా నిండటంతో హౌజ్‌లో రెండో కెప్టెన్‌గా విశ్వ విన్నర్‌గా నిలిచారు. 

మరోవైపు లోబో, ఉమాదేవిలకు సింగిల్‌ బెడ్‌ లేదు. దీంతో వారిలో ఒకరికి సింగిల్‌ బెడ్‌ ఇచ్చేందుకు టాస్క్ పెట్టారు. వీరిలో ఇద్దరు ఎవరు బాగా ఇంటి సభ్యులను ఎంటర్‌టైన్‌ చేస్తే వారు విజేతగా నిలుస్తారు. వారికి సింగిల్‌ బెడ్‌ లభిస్తుంది. ఇందులో లోబో, ప్రియాంక సపోర్ట్ తో స్కిట్‌ ప్రదర్శించారు. లోబో హైదరాబాదీ ఆటో వాలాగా, ప్రియాంక ప్యాసింజర్‌గా చేశారు. ప్రియాంక తనది తాయ్‌, పారిస్‌ అంటూ పాష్‌గా చెబుతూ బిల్డప్‌ కొడుతుంది. ఆమె అందానికి ఫిదా అయిన లోబో చేసే యాక్టింగ్‌ ఆమె చెప్పే మాటలు నమ్మలేక వెంటపడి కొట్టడం, చివరికి ఆమె జనాల వద్ద అడుక్కోవడం, చివరికి ప్రియాంక వచ్చిన లోబోని హగ్‌ చేసుకోవడంతో ఆయన ఫిదా అయి పోవడం నవ్వులు పూయించింది. 

మరోవైపు ఉమాదేవి.. సిరితో కలిసి అత్తా కోడళ్లు యాక్ట్ చేశారు. ఊహలు ఎలా ఉంటాయి, అసలు ఎలా ఉంటుందనేది చేసి చూపించింది. అయితే తన కొడుకు షణ్ముఖ్‌ అంటూ సిరితో పరోక్షంగా లింక్‌ పెట్టింది. సరయు పోతూ పోతూ సిరితో కలిసి ఆడుతున్నాడని ఆరోపించిన విషయం తెలిసిందే. పరోక్షంగా షణ్ముఖ్‌పై పంచ్‌లు వేసింది ఉమాదేవి. ఓ రేంజ్‌లో ఆడుకుంది. లోబో, ఉమాదేవి స్కిట్‌లో లోబో స్కిట్‌ బాగా నవ్వించిందని ఇంటి సభ్యులు నిర్ణయించారు. ఆయనకు సింగిల్‌బెడ్‌ లభించింది. దీంతో లోబోతోపాటు ఇంటిసభ్యులు కూడా పండగా చేసుకున్నారు.

మరోవైపు గురువారమే షణ్ముఖ్‌ బర్త్ డే కూడా చేశారు. ఇంటి సభ్యులంతా రాత్రి బర్త్ డే కేక్‌ కట్‌ చేయించారు. అంతేకాదు షణ్ముఖ్‌ పేరెంట్స్ కూడా ఆయనకు బర్త్ డే విషెస్‌ తెలిపారు. మరోవైపు దీప్తి సునైనా లైవ్‌లోకి వచ్చి ఐ లవ్‌యూ చెప్పడం హైలైట్‌గా  మారింది. ఆమె విషెస్‌కి, ప్రపోజ్‌కి షణ్ముఖ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. అంతకు ముందు హమీద విషయంలో షణ్ముఖ్‌ని యాంకర్‌ రవి, లహరి కలిసి ఆటపట్టించడం హైలైట్‌గా మారింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?
Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం