`లగాన్‌`, `దేవదాస్‌` ఆర్ట్‌ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్‌ కన్నుమూత.. అప్పుల బాధతో ఆత్మహత్య?

Published : Aug 02, 2023, 11:14 AM ISTUpdated : Aug 02, 2023, 11:48 AM IST
`లగాన్‌`, `దేవదాస్‌` ఆర్ట్‌ డైరెక్టర్ నితిన్‌ దేశాయ్‌ కన్నుమూత.. అప్పుల బాధతో ఆత్మహత్య?

సారాంశం

ప్రముఖ పాపులర్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ నితిన్‌ దేశాయ్‌ కన్నుమూశారు. ఆయన బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు.  దీంతో బాలీవుడ్‌ సినీ వర్గాలు షాక్‌ కి గురవుతున్నాయి.

ప్రముఖ పాపులర్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ నితిన్‌ దేశాయ్‌ కన్నుమూశారు. ఆయన బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ముంబయికి సమీపంలోని కర్జాత్‌ లో ఉన్న తన స్టూడియోలో ఆయన ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం షాక్‌కి గురి చేస్తుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఆయన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. దిగ్గజ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా రాణిస్తున్న ఆయన మరణం పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు షాక్‌కి గురవుతున్నారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ఆయన అసలు పేరు నితిన్‌ చంద్రకాంత్‌ దేశాయ్‌ దాపోలిలో జన్మించారు. బాలీవుడ్‌లో మల్టీటాలెంటెడ్‌గా రాణిస్తున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్‌డిజైనర్‌గా అనేక చిత్రాలకు పనిచేశారు. మరాఠి, హిందీ చిత్రాలకు ఆయన ప్రధానంగా వర్క్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్‌గా `హమ్‌ దిల్‌ దే సనమ్‌`, `లగాన్‌`, `దేవదాస్‌`, `జోధా అక్బర్‌`, `ప్రేమ్‌ రతన్‌ ధ్యాన్‌ పాయో` వంటి భారీ చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. దీంతో ఇండియన్‌ పాపులర్‌ ఆర్ట్ డైరెక్టర్‌, ప్రొడక్షన్ డిజైనర్‌గా పాపులర్‌ అయ్యారు నితిన్‌ దేశాయ్‌. 

1987లో ఆయన ముంబయికి వచ్చారు. స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌గా కెరీర్‌ని ప్రారంభించారు. మొదట్లో కొన్ని సీరియల్స్ కి పనిచేశారు. 1989లో `పరిందా` చిత్రంతో ఆర్ట్ డైరెక్టర్‌గా బాలీవుడ్‌కి పరిచయం అయ్యారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌గా `1942ః ఏ లవ్‌ స్టోరీ`, `హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌`, `లగాన్‌`, `దేవ్‌ దాస్‌`, `జోధా అక్బర్‌`, `ప్రేమ్‌ రతన్‌ ధ్యాన్‌ పాయో`, `స్వదేశ్‌`, `ఫ్యాషన్‌`, `పాని పట్‌`, `వన్స్ అపాన్‌ ఏ టైమ్‌ఇన్‌ ముంబయి`, ` దోస్తానా` వంటి చిత్రాలకు పనిచేశారు.

 తన 20ఏళ్ల కెరీర్‌లో ప్రముఖ దర్శకులు అశుతోష్‌ గోవారికర్‌, విధు వినోద్‌ చోప్రా, రాజ్‌ కుమార్‌ హిరానీ, సంజయ్‌ లీలా భన్సాలీ వంటి స్టార్‌ డైరెక్టర్స్ తో పనిచేశారు. మరోవైపు చంద్రకాంత్‌ ప్రొడక్షన్స్ పేరుతో `దేశ్‌ దేవి` చిత్రాన్ని నిర్మించారు. కచ్‌ దేవి మాత గురించి రూపొందించిన భక్తిరస చిత్రమిది. దీంతోపాటు `రాజ శివచత్రపతి`, `ట్రక్‌ భార్‌ స్వప్ప` చిత్రాలు చేశారు. ఓ వైపు ఆర్ట్ డైరెక్టర్‌ గా రాణిస్తూనే నటుడిగా, నిర్మాతగా మారారు. యాక్టర్‌గా `హమ్‌ సాబ్‌ ఏక్‌ హైన్‌`, `దాడ్‌ః ఫన్‌ ఆన్‌ ది రన్‌~, `హెలో జై హింద్‌`, `బల్గంధర్వ` చిత్రాల్లో నటించారు. 2011ల దర్శకుడిగా `హలో జై హింద్‌`, `అజింతా` చిత్రాలు రూపొందించారు. 

నితిన్‌ దేశాయ్‌.. అంతర్జాతీయ సినిమాలు `పరిందా`, `ఖామోషి`, `మాచిస్‌`, `బాద్‌షా`, `డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌`, `రాజు చాచా` వంటి చిత్రాలకు కూడా పనిచేశారు. ఆయన `హమ్‌ దిల్ దే చుకే సనమ్‌`, `దేవదాస్‌`, `లగాన్‌`, `డా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌` చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా జాతీయ అవార్డులు అందుకున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా