
నందమూరి బాలకృష్ణ జోరుకు మామూలుగా లేదు. సినిమా మీద సినిమా అనౌన్స్ చేస్తూ.. ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తున్నాడు. అఖండ సినిమా అఖండ విజయంతో ఆయన హడావిడి మామూలుగా లేదు.. ఇక అఖండ తరువాత ప్రస్తుతం తన కెరీర్‌లోని 107వ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు బాలయ్య. ఇక ఈసినిమా షూటింగ్ కూడా కంప్లీట్ కావస్తోంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.
ఇది పూర్తిగాక ముందే, బాలయ్య తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించడానికి రెడీ అయ్యాడు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తన 108వ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన చేయబోయే హీరోయిన్ పై చాలా రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది. అసలే టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉంది. ఉన్నవాళ్లనే రిపీట్ చేయాల్సిన పరిస్థితి. కుర్ర హీరోయిన్లు వాళ్ళ పక్కన సెట్ అవ్వరు.. మరీ ఏజ్ గ్యాప్ కూడా ఉండటంతో.. యంగ్ హీరోయిన్స్ తో చేసే అవకాశం లేదు. చేసినా విమర్షలు ఎదుర్కొవల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బాలయ్యకు నెంబర్ వన్ హీరోయిన్ ను సెట్ చేశాడటన అనిల్ రావిపూడి.
అయితే ఈ సినిమాలో మరోసారి బాలయ్య పక్కన నయనతారను తీసుకునేందుకు అనిల్ రావిపూడి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్య సరసన నయనతార బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి బాలయ్య సరసన నయనతార నటిస్తుందనే న్యూస్ ప్రస్తుతం సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది. మరి నిజంగానే బాలయ్య సరసన మరోసారి నయనతార నటిస్తుందా లేదా అనేది అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
బాలయ్యకు కూడా చాలా ఇష్టమైన హీరోయిన్ నయనతార. సింహా సినిమాలో బాలయ్యతో నటించి మెప్పించింది లేడీ సూపర్ స్టార్. ఆ సినిమా తరువాత ఆయన ఏరి కోరి శ్రీరామ రాజ్యం సినిమాలో సీతగా నయనతారను తీసుకున్నాడు. ఈ రెండు సినిమాల్లో వీరి జోడీ అద్బుతంగా వర్కౌట్ అయ్యింది. అది గమనించిన అనిల్ రావిపూడి.. నయనతార అయితే సినిమాకు బాగుంటుందని ఫిక్స్ అయ్యాడ. బాలయ్యతో పాటు.. ఆయన ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతారు.. తన పాత్రకు కూడా ఆమె సరిగ్గా కుదురుతుంది అని అనుకున్నాడట. మరి ఆమె ఈ సినిమాకు ఆమె ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి.
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమాకు ఇప్పటికే రెడీ అయ్యాడు బాలకృష్ణ. అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే మొదలుపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను సరికొత్త కాన్సెప్ట్‌తో అనిల్ రావిపూడి రూపొందించనుండగా, ఈ సినిమాలో బాలయ్య ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. మూవీ టీమ్ నుంచి వచ్చిన సమచారం ప్రకారం ఎప్పుడు బాలయ్య చేయని పాత్ర ఇందులో చేస్తున్నారట.