డబ్బుల కోసం వచ్చానంటూ శ్రీసత్య షాక్‌.. ఇంటిసభ్యుల నిజస్వరూపాలు బట్టబయలు.. నామినేషన్స్ లో తొమ్మిది మంది

By Aithagoni RajuFirst Published Sep 19, 2022, 11:34 PM IST
Highlights

బిగ్‌ బాస్‌ 6 చప్పగా సాగుతుందనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో హీటు పెంచే ప్రయత్నం చేశారు బిగ్‌ బాస్. అందులో భాగంగా రెండో వారంలో ఇద్దరిని ఎలిమినేట్‌ చేశాడు.

బిగ్‌ బాస్‌ తెలుగు 6 (Bigg Boss Telugu 6) షో.. 16వ రోజుకి చేరుకుంది. ఊహించని విధంగా రెండో వారంలో ఇద్దరిని ఎలిమినేట్‌ చేసి షాకిచ్చాడు నాగార్జున. సరైన పర్‌ఫెర్మెన్స్ ఇవ్వడం లేదనే ఉద్దేశ్యంతో మొదట శానీని ఎలిమినేట్‌ చేయగా, ఆదివారం నామినేషన్‌లో ఉన్న వారిలో అతి తక్కువ ఓటింగ్స్ తో అభినయశ్రీ ఎలిమినేట్ అయ్యారు. అదే సమయంలో బిగ్‌ బాస్‌ 6 చప్పగా సాగుతుందనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో హీటు పెంచే ప్రయత్నం చేశారు బిగ్‌ బాస్. అందులో భాగంగా రెండో వారంలో ఇద్దరిని ఎలిమినేట్‌ చేశాడు.

అంతేకాడు నాగ్‌(Nagarjuna) ఇంటి సభ్యులందరికీ పెద్ద క్లాస్‌ పీకాడు. దీంతో ఇంటి సభ్యులు కసి రగిలింది. ఆ కసి మూడో వారానికి సంబంధించిన నామినేషన్‌లో కనిపించింది. సోమవారం నామినేషన్ల ప్రక్రియ అత్యంత హాట్‌ హాట్‌ గా సాగింది. ఒక్కసారిగా హౌజ్‌ మొత్తం హీటెక్కింది. ఆరో సీజన్‌లో ఫస్ట్ టైమ్ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకోవడం జరిగింది. నామినేషన్ల ప్రక్రియలో చాలా వరకు `సిల్లీ సీజన్‌` అనేది చాలా వరకు కంటెస్టెంట్లు చెప్పడం విశేషం. 

తాజాగా సోమవారం ఎపిసోడ్‌లో ఒక్కొక్కరి నిజ స్వరూపాలు బయటపడ్డాయి. వరస్ట్ పర్‌ఫెర్మె తో జైలుకెళ్లిన శ్రీసత్య ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టింది. తాను డబ్బుకోసమే బిగ్‌ బాస్‌ కి వచ్చినట్టు తెలిపింది. మరోవైపు శ్రీసత్యకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు అర్జున్‌. తాను బాధ పెట్టి ఉంటే సారీ చెప్పాడు. ఆమెతో పులిహోర కలిపే ప్రయత్నం స్టార్ట్ చేశాడు. ఇక సింపతి కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఇనయ సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 

ఇక నామినేషన్ల ప్రక్రియ మరింత హీటెక్కించింది. ఇందులో మొదట శ్రీసత్య .. ఆరోహి ఇనయలను నామినేట్‌ చేసింది. దీనికి సిల్లీ రీజన్స్ తో నామినేట్‌ చేశారంటూ ఇనయ ఫైర్‌ అయ్యింది. గీతూ.. రియల్‌గా లేవని సుదీప, చంటిలను నామినేట్‌ చేయగా, సిల్లీ రీజన్‌ అని చెప్పడం విశేషం. ఈ క్రమంలో సుదీప, గీతూల మధ్య జరిగిన వాగ్వాదం హీటెక్కించింది. దానికి ప్రతీకారంగా చంటి.. గీతూ, రేవంత్‌లను నామినేట్‌ చేశాడు. ఈ విషయంలోనూ కూడా గీతా గట్టి గా వాదించింది. 

ఇనయ గీతూ, రేవంత్‌లను నామినేట్‌ చేయగా, గీతూ, ఇనయ మధ్య పీక్‌లో వాగ్వాదం జరిగింది. ఏ పోవే అంటూ, పలు బూతు పదాలు వాడుతూ ఇనయపై కామెంట్లు చేసింది గీతూ. ఇది ఇతరకు కూడా అభ్యంతరంగా మారిపోయింది. అందరూ నీ ప్రవర్తన పట్ల ఇబ్బంది పడుతున్నాని చెప్పింది ఇనయ. ఆదిరెడ్డి.. ఇనయ, వసంతిలను నామినేట్‌ చేశాడు. వసంతి గేమ్‌ ఆడటం లేదని ఆయన నామినేట్‌ చేయగా, తన నామినేషన్‌ టైమ్‌ నువ్వు కూడా గేమ్‌ ఆడటం లేదని, ఫస్ట్ అది తెలుసుకుని మాట్లాడూ అంటూ పంచ్‌ ఇచ్చింది వసంతి. ఆదిరెడ్డి అంతెత్తున లేచి ఫైర్‌ కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. 

సుదీప.. గీతూ, శ్రీహాన్‌లను నామినేట్‌ చేసింది. బాలాదిత్య.. ఆరోహి, రేవంత్‌లను, వసంతి.. ఆదిరెడ్డి, నేహాలను, మరీనా.. రేవంత్‌, పైమాలను, ఆర్జే సూర్య.. రేవంత్‌, బాలాదిత్యలను, కీర్తి.. ఆరోహి, చంటిలను, నేహా.. వసంతి, గీతూలను, అర్జున్‌.. ఆరోహి, శ్రీహాన్‌, పైమా..రోహిత్‌, బాలాదిత్యలను, శ్రీహాన్‌.. ఇనయ, అర్జున్‌లను, ఆరోహి.. శ్రీ సత్య, బాలాదిత్యలను, రాజ్‌ శేఖర్‌.. ఆరోహి, బాలాదిత్యలను నామినేట్‌ చేశారు. ఇందులో అత్యధిక ఓట్లు పడ్డ రేవంత్‌, బాలాదిత్య, గీతూ, ఆరోహి, చంటి, వసంతి, నేహా, శ్రీహాన్‌ మూడో వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయ్యారు.  
 

click me!