సూపర్‌ స్టార్‌తో లేడీ సూపర్‌ స్టార్‌.. జోడీ అదిరిపోయినట్టే ?

Published : Jul 06, 2021, 09:49 AM IST
సూపర్‌ స్టార్‌తో లేడీ సూపర్‌ స్టార్‌.. జోడీ అదిరిపోయినట్టే ?

సారాంశం

నయనతార తెలుగులో మరో సినిమా చేయబోతుందని సమాచారం. చివరిగా ఈ సీనియర్‌ హీరోయిన్‌ `సైరా`లో చిరంజీవితో జోడీ కట్టింది. తనదైన నటనతో మంత్రముగ్దుల్ని చేసింది. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ సరసన నటించబోతుందట.   

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఏజ్‌ పెరిగే కొద్ది మరింత దూకుడు పెంచుతుంది. ఈ అమ్మడి కోసం కోలీవుడ్‌, టాలీవుడ్‌, బాలీవుడ్‌ నుంచి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల షారూఖ్‌- అట్లీ చిత్రంలో నయనతారని ఎంపిక చేశారని ప్రచారం జరిగింది. తాజాగా తెలుగులో మరో సినిమా చేయబోతుందని సమాచారం. చివరిగా ఈ సీనియర్‌ హీరోయిన్‌ `సైరా`లో చిరంజీవితో జోడీ కట్టింది. తనదైన నటనతో మంత్రముగ్దుల్ని చేసింది. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ సరసన నటించబోతుందట. 

మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కబోతుంది. త్వరలో ఇది ప్రారంభం కానుంది. ఇందులో హీరోయిన్‌ పాత్ర కోసం చాలా మంది పేర్లని పరిశీలించారు. కియారా అద్వానీ, కృతి సనన్‌, జాన్వీ కపూర్‌, మాళవిక మోహనన్‌, జాన్వీ కపూర్‌ వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ తాజాగా మరో స్టార్‌హీరోయిన్‌ పేరు బలంగా వినిపిస్తుంది. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. 

నయన్‏తో చర్చలు జరుపుతున్నారని టాక్. ఒకవేళ నయన్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మహేష్ సరసన మొదటి సారి నయన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని చెప్పవచ్చు. అలాగే మరో హీరోయిన్‏గా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేయాలనుకుంటున్నారట మేకర్స్. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చే ఈ మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని డిఫరెంట్ కథాంశంతో ఉంటుందని సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నారు.  

మహేష్‌ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్‌ దర్శకుడు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌ నటిస్తుంది. మరోవైపు నయనతార ప్రస్తుతం `కాతు వాకుల రెండు కాదల్‌`, రజనీతో `అన్నాత్తే`,అలాగే `నెట్రికన్‌` చిత్రాల్లో నటిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Jr NTR: ఏఎన్నార్ అడిగిన ఒక్క మాటతో జూ.ఎన్టీఆర్ ఆశలు గల్లంతు.. దాన వీర శూర కర్ణ ఇక లేనట్లే ?
Champion Movie Review: ఛాంపియన్‌ మూవీ రివ్యూ.. శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?