యమ స్పీడ్‌గా కొట్టేసిన కార్తి.. సుల్తాన్‌ వచ్చేది ఎప్పుడు?

Published : Oct 16, 2020, 06:10 PM IST
యమ స్పీడ్‌గా కొట్టేసిన కార్తి.. సుల్తాన్‌ వచ్చేది ఎప్పుడు?

సారాంశం

కార్తి హీరోగా రష్మిక మందన్న కథానాయికగా రూపొందుతున్న తమిళ చిత్రం `సుల్తాన్‌` షూటింగ్‌ పూర్తి చేసుకుని డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించుకుంది.

హీరో కార్తి ప్రస్తుతం `సుల్తాన్‌` చిత్రంలో నటిస్తున్నారు. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల పూర్తి చేసుకుంది. ఇందులో కార్తీతో రష్మిక మందన్నా రొమాన్స్ చేస్తుంది. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ పతాకంపై ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. 

కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేసి, షూటింగ్‌లకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనుమతివ్వడంతో ఏమాత్రం లేట్‌ చేయకుండా కరోనా జాగ్రత్తలు పాటించి `సుల్తాన్‌` చిత్ర షూటింగ్‌ని పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభించుకుంది. 

శుక్రవారం నుంచి డబ్బింగ్‌ ప్రారంభించారు. కార్తి డబ్బింగ్‌ చెప్పారు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర బృందం పంచుకుంది. ఇప్పటికే ఎడిటింగ్‌ కార్యక్రమాలు పూర్తయినట్టు చిత్ర బృందం పేర్కొంది. త్వరలోనే విడుదల చేస్తారట. మరి ఇది థియేటర్‌లోనే వస్తుందా? ఓటీటీలో విడుదలవుతుందా? అన్నది చూడాలి.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?