
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన మొనాలిసా భోస్లే ప్రేమ కథ సుఖాంతమైంది. తన ప్రియుడు మహమ్మద్ ఫర్మాన్‌ను కేరళలో పెళ్లి చేసుకుంది. తిరువనంతపురంలోని పూవార్‌లో ఉన్న అరుమానూర్ నైనార్ ఆలయంలో వీరి వివాహం జరిగింది. వరుడు మహమ్మద్ ఫర్మాన్ మహారాష్ట్రకు చెందినవాడు. అంతకుముందు, తన తండ్రి తనను బలవంతంగా తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని మొనాలిసా తంబానూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పూవార్‌లోని ఓ షూటింగ్ స్పాట్ నుంచి మొనాలిసా, ఆమె స్నేహితుడు ఫర్మాన్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. పోలీసులు మొనాలిసాను ఫర్మాన్‌తో పంపించారు. వీరి పెళ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ జంట కేరళకు వచ్చి ఆశ్రయం పొందింది. కేరళలోనే పెళ్లి చేసుకోవాలని ఉందని మొనాలిసా, ఫర్మాన్ తెలిపారు.
కుంభమేళాలో వైరల్ అయినా మోనాలిసా మొత్తంగా మరోసారి తన పెళ్లితో వార్తల్లో నిలిచారు. నీలి కళ్ళతో మోనాలిసా సోషల్ మీడియాని షేక్ చేసేసింది. సెలెబ్రెటీగా మారిపోయింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది.