Kubera First Look: లుక్‌ ఏమో బిచ్చగాడు.. టైటిలేమో `కుభేర`.. ఇంట్రెస్టింగ్‌గా ధనుష్‌, నాగ్‌ సినిమా

Published : Mar 08, 2024, 07:19 PM IST
Kubera First Look: లుక్‌ ఏమో బిచ్చగాడు.. టైటిలేమో `కుభేర`.. ఇంట్రెస్టింగ్‌గా ధనుష్‌, నాగ్‌ సినిమా

సారాంశం

ధనుష్‌, నాగార్జున కలిసి శేఖర్‌ కమ్ముల చిత్రంలో నటిస్తున్నారు. మహశివరాత్రి సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ని ప్రకటిస్తూ ధనుష్‌ లుక్‌ని విడుదల చేశారు. ఇది ఇంట్రెస్టింగ్‌గా ఉంది. 

ధనుష్‌ తెలుగు హీరో అయిపోతున్నాడు. ఆయన ఆ మధ్య `సార్‌` మూవీతో మెప్పించాడు. మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారు. నాగార్జున మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌ కమ్ముల దర్శకుడు. తాజాగా మహాశివ రాత్రి సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఈ మూవీకి `కుభేర` అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మేరకు ఫస్ట్ లుక్‌ల విడుదల చేయగా, ఇందులో ధనుష్‌ చిరిగిన, మాసిన బట్టలతో బిచ్చగాడిలా కనిపిస్తున్నాడు. 

గోడపై శివుడు, పార్వతి చిత్రాలు గీసి ఉండగా, వాటిని చూస్తూ కింద నుంచి పైకి లేచాడు ధనుష్‌. అటు ఇటు చూస్తే స్మైల్‌ ఇచ్చాడు. అయితే ధనుష్‌ బిచ్చగాడి గెటప్‌లో కనిపిస్తున్నాడు. కానీ టైటిల్‌ `కుభేర` అనే పెట్టడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది. మనీ, మాఫియా చుట్టూ ఈ మూవీ సాగుతుందని తెలుస్తుంది. శేఖర్‌ కమ్ముల ఇప్పటి వరకు లవ్‌ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా సినిమాలు చేశాడు. కూల్‌ మూవీస్‌తో ఆకట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన రూట్‌ మార్చినట్టు తెలుస్తుంది. బలమైన పాయింట్‌ని ఈ మూవీలో డిస్కస్‌ చేస్తున్నట్టు సమాచారం. 

ఇక నాగార్జున లుక్‌ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ధనుష్‌ బిచ్చగాడు అయితే నాగార్జున పాత్ర రిచ్‌ గా ఉంటుందని అర్థమవుతుంది. అదే సమయంలో పేదవాడైన ధనుష్‌ కుభేరుడు ఎలా అయ్యాడనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. మరి శేఖర్‌ కమ్ముల ఏం చేయబోతున్నాడో చూడాలి. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.  ఏషియన్‌ సినిమాస్‌, శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో పాన్‌ ఇండియా మూవీగా దీన్ని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 

Read more: NBK109 Glimpse: వేట స్టార్ట్ చేసిన బాలయ్య.. దుమ్మురేపేలా `ఎన్బీకే109` గ్లింప్స్..

Also read: టబు పెళ్లి చేసుకోకపోవడానికి నాగార్జునే కారణమా?.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన మన్మథుడు.. ఇప్పటికీ టచ్‌లోనే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు