NBK109 Glimpse: వేట స్టార్ట్ చేసిన బాలయ్య.. దుమ్మురేపేలా `ఎన్బీకే109` గ్లింప్స్..

Published : Mar 08, 2024, 05:52 PM IST
NBK109 Glimpse: వేట స్టార్ట్ చేసిన బాలయ్య.. దుమ్మురేపేలా `ఎన్బీకే109` గ్లింప్స్..

సారాంశం

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ విడుదలైంది. బాలయ్య వేట వేరే లెవల్‌లో ఉంది.   

బాలకృష్ణ వరుస విజయాలతో ఉన్నారు. ఆయన బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మరో బ్లాక్‌ బస్టర్‌ కంటెంట్‌తో వస్తున్నారు. బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` పేరుతో ఓ మూవీ చేస్తున్నారు. తాజాగా మహాశివ రాత్రి పండుగ సందర్భంగా ఈ మూవీ కి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. బాలయ్య ఫస్ట్ లుక్‌తోపాటు గ్లింప్స్ విడుదల చేయగా, అది దుమ్మురేపేలా ఉంది. అడవిలో విలన్లని బాలయ్య వెంటాడి, వేటాడి చంపుతున్నాడు. ఓ రకంగా ఆయన ఊచకోత చూపిస్తున్నారు. 

మొదట ఓ డ్యామ్‌ నుంచి నిప్పుల కొలిమి వస్తూ ఎన్బీకే పేరుని తడిపేసింది. ఆ తర్వాత అడవిలో మంటలు చెలరేగుతుంటాయి. విలన్లు బాలయ్యని వేసేయడానికి వస్తున్నారు. అప్పుడే జీపులో నుంచి దిగిన తన ఆయుధాల పెట్టె ఓపెన్‌ చేశాడు బాలయ్య. అందులో లిక్కర్‌ వేసుకుని యుద్ధానికి రెడీ అయ్యాడు. దీంతో వెనకాల వాయిస్‌ ఓవర్‌లో `ఏంట్రా వార్‌ డిక్లేర్‌ చేశావా? అని అడగ్గా, సింహం నక్కలమీదకు వస్తే వార్‌ కాదురా లఫూట్‌. హంటింగ్‌ అవుతుందని చెబుతూ, ప్రత్యర్థులకు ఉచకోత కొస్తూ తన విశ్వరూపం చూపించారు బాలయ్య. 

గ్లింప్స్ చాలా స్టయిలీష్‌గా ఉంది. బీజీఎం అదిరిపోయింది. బాలయ్య సినిమాకి సరికొత్తగా ఉంది. తమన్‌లో కొత్త యాంగిల్‌ కనిపించింది. బాలయ్య మార్క్ కంటెంట్‌తోనే ఈ మూవీ రూపొందుతుందని అర్థమవుతుంది. కానీ ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా కనిపిస్తుంది. గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫోర్చ్యూ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలయ్య పేరుకి కొత్త అర్థం చెప్పారు దర్శకుడు. నేచురల్‌ బార్న్ కింగ్‌(ఎన్బీకే) అనే చెప్పడం విశేషం. అయితే టైటిల్‌ని మాత్రం ఇంకా రివీల్‌ చేయలేదు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?