నా భర్తకు మరో మహిళతో సంబంధం! నటి ఆవేదన

Surya Prakash   | Asianet News
Published : Apr 21, 2021, 03:06 PM IST
నా భర్తకు మరో మహిళతో సంబంధం! నటి ఆవేదన

సారాంశం

ఆమె భర్త వేరే మహిళతో ఉంటున్నాడని ఆ నటుడు భార్య ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపణ చేస్తోంది.

వివేహేతర సంబంధాలు మీడియాకు ఎక్కటం ఈ మద్యకాలంలో చాలా కామన్ విషయంగా మారింది. గతంలో కుటుంబంలో అందరూ కూర్చుని అవతలి వ్యక్తి ఆడైనా,మగైనా గడ్డి పెట్టి సంసారం సెట్ చేసేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు అలాంటివాళ్లు కరవు అయ్యారు. అందుకేనేమో మీడియాతో తన ఆవేదన వెళ్లబోసుకుంటున్నారు. తాజాగా ఓ బుల్లితెర జంట వివాహం విఛ్చిన్నమవటానికి సిద్దంగా ఉంది. ఆమె భర్త వేరే మహిళతో ఉంటున్నాడని ఆ నటుడు భార్య ఆవేదన వ్యక్తం చేస్తూ ఆరోపణ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. మలయాళ బుల్లితెర జంట అంబిలి దేవి, ఆదిత్యల వివాహం అప్పట్లో సెన్సేషన్. మూడు పెళ్లిళ్ల తర్వాత ఆదిత్య, మొదటి భర్తకు గుడ్‌బై చెప్పి అంబిలి.. ఇద్దరూ 2019లో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఈ మధ్యన వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. దీనిపై అంబిలి దేవి స్పందిస్తూ.. తానిప్పటికీ ఆదిత్య భార్యగానే బతుకుతున్నానని చెప్పింది. అయితే మరిన్ని విషయాలు రివీల్ చేసింది.

అంబిలి మాట్లాడుతూ.."ఎన్నో ఒడిదొడుకులను దాటుకుని అతడిని రెండో పెళ్లి చేసుకున్నా. నేను పెగ్నెంట్ అయ్యేవరకు మా జీవితం సంతోషంగా సాగింది. బెడ్‌ రెస్ట్‌ వల్ల నటనకు బ్రేక్‌ కూడా చెప్పా . ఈ లోగా లాక్‌డౌన్‌ వచ్చిపడింది. ఆ సమయంలో నా భర్త 13 ఏళ్ల కొడుకున్న మహిళతో రిలేషన్‌లో ఉన్నాడని అర్దమైంది. మొదట్లో నేను నమ్మలేదు. నా భర్త అలాంటివాడు కాదని బలంగా అనుకున్నాను. తెలిసినవాళ్లు నాకు ఫోన్లు చేసి ఆమె గర్భం దాల్చింది అని చెప్తే దాన్ని కొట్టిపారేశాను. కానీ కొద్ది రోజులుకు అవి రూమర్స్ కావు నిజమే అని తెలిసింది. ఏం చేయాలో అర్దం కాలేదు".

ఇదే విషయాన్ని నిలదీస్తే అతడు విడాకులు కోరుతున్నాడు. నాకు విడాకులు అక్కర్లేదు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, కలిసే ఉందాం అని చెప్పినా ఒప్పుకోవటం లేదు. కానీ అతడు రిలేషన్ పెట్టుకున్న మహిళే సర్వస్వం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆదిత్య ఇలా ఒక్కసారిగా ఎందుకు మారిపోయాడో అర్థం కావట్లేదు. నన్ను లెక్కచేయట్లేదు" అని అంబిలి వాపోయింది. మరి ఈ జంట జీవితం ఏ మలుపు తిరగనుందో చూడాలి.
 

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: డైరెక్టర్ తో ఈషా రెబ్బా రిలేషన్ షిప్, త్వరలో పెళ్లి.. ఒకరిని చూస్తున్నా అంటూ కంఫర్మ్ చేసిన నటి
తనతో నటించిన హీరోయిన్లలో హీరో నానికి ఫేవరెట్ ఎవరో తెలుసా.?