
ఫస్టు మూవీతోనే ఒవర్ నైట్ స్టార్ గా మారిపోయింది.. కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఆమెకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటి నుంచి కూడా ఆమె వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతోంది. అయితే మొదటి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతీశెట్టి... నాలుగో సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది. ఇక ఆ తరువాత నుంచి వరుసగా మూడు సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో.. హ్యాట్రిక్ ఫెయిల్యూర్ ను కూడా మూటగట్టుకుంది బ్యూటీ.
ఇక అప్పటి నుంచి హిట్ సినిమా కోసం నానా తంటాలు పడుతోంది కృతిశెట్టి. ఏ హీరోతో చేసినా అదే ఫలితం అన్నట్టుగా ఆమె కెరియర్ కొనసాగుతోంది. దాంతో ఏం చేయాలో తోచని అయోమయంలో ఆమె ఉంది. ఇక గతంలో నాగచైతన్యతో ఆమె చేసిన బంగార్రాజు హిట్ కొట్టింది. అదే చైతూతో ఆమెరీసెంట్ గా చేసిన కస్టడీ మాత్రం ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలోనే కృతీ శెట్టి తనకు ప్లాప్ ఇచ్చిన హీరో నితిన్ కు మరోసారి జోడీగా నటించబోతుననట్టు తెలుస్తోంది.
గతంలో నితిన్ సరసన ఆమె చేసిన మాచర్ల నియోజక వర్గం అంతగా ఆడలేదు. నితిన్ తో ప్లాప్ పడ్డా సరే..మళ్లీ మరోసారి నితిన్ జోడీగా నటించబోతుందట బ్యూటీ. నితిన్ కు భీష్మ సినిమాతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతోనే నితిన్ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. రష్మిక కథానాయికగా ఈ సినిమా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకున్నారనేది టాక్.
సెకండ్ హీరోయిన్ ఛాన్స్ అయినా వదలుకోకుండా చేస్తుందట కృతి శెట్టి.. అది కూడా తనకు గతంలో ప్లాప్ ఇచ్చిన హీరో సినిమాలో సెంకండ్ హీరోయిన్ గా.. ఇక ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ తో పాటు.. నటిజన్లు ఔరా అనుకుంటున్నారు. కృతి శెట్టికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటూ జాలి పడుతున్నారు. ఇప్పుడు నితిన్ కి మాత్రమే కాదు .. కృతికి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం.