
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని మాస్ లుక్ లో అదరగొడుతున్నాడు. రామ్ పోతినేని తన నెక్ట్స్ మూవీలో పోలీస్ గా కనిపించినున్నారు. ఇప్పటికే షూటింగ్ కొనసాగిస్తున్నమూవీ ‘ది వారియర్’ (The Warrior) నుంచి అప్డేట్ గురించి ఫ్యాన్స్ , తెలుగు ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో రామ్ మాస్ లుక్ లో అభిమానుల మతి పోగోడుతున్నారు. మరోవైపు ఈ సినిమాలో మాస్ యాక్షన్ లో దుమ్మరేపనున్నాడు రామ్ పోతినేని (Ram Pothineni). దాని కోసమే సెకండ్ టైమ్ సిక్స్ ప్యాక్ కూడా చేశారట. లింగుస్వామి(Lingu Swami) డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.
అయితే, ఉస్తాద్ రామ్ 19వ చిత్రం ‘వారియర్’ షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తోంది వారియర్ టీం. ఈ సందర్భంగా రామ్ షూటింగ్ ముగించుకొని వెళ్తుండగా అభిమానులకు ఫోటోలు, సెల్ఫీలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన వారియర్ లుక్ లోని ఫొటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగా షేర్ చేస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
'ది వారియర్'లో కర్నూల్‌కు చెందిన ఆర్జే (రేడియో జాకీ)గా కృతీ శెట్టి సందడి చేయనున్నారు. ఆమె క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. కర్నూల్‌లో విజిల్ మహాలక్ష్మి అంటే చాలా ఫేమస్. అమ్మాయి చేసే ప్రోగ్రామ్స్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పోలీస్‌కి, ఆర్జేకు ఎక్కడ కుదిరింది? ప్రేమలో ఎలా పడ్డారు? అనేది సినిమాలో చూడాలి. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రిలీజైన ఆయన లుక్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ లభించింది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ రోజు హీరోయిన్ లుక్ విడుదల చేశారు. అందులో కూల్‌గా స్కూటర్ నడుపుతూ కృతీ శెట్టి కనిపించారు. జీన్స్, టీ - షర్ట్... మోడ్రన్‌గా ఉన్నారు.
దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ "సినిమాలో యాక్షన్‌తో పాటు ప్రేమకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆర్జే విజిల్ మహాలక్ష్మిగా కృతీ శెట్టి కనిపిస్తారు. ఆమె పాత్ర ప్రేక్షకులందరూ ఇష్టపడేలా ఉంటుంది. రామ్, కృతీ శెట్టి జోడీ చూడముచ్చటగా ఉంది. రామ్ ఫస్ట్ లుక్‌కు వచ్చిన స్పందన నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. పోలీసుల మధ్యలో హీరో సీరియస్ లుక్ బావుందని ప్రేక్షకులు చెప్పారు. హీరోయిన్ లుక్, రోల్ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.
నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ... "చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్... విలన్స్‌తో యాక్షన్ సీన్స్ ఎక్ట్స్రాడినరీగా వస్తున్నాయి. మా హీరో రామ్ అద్భుతంగా చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇస్తున్నారు" అని చెప్పారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపించనున్నారు.