`మోసగాళ్లకు మోసగాడు` రీ రిలీజ్‌ ట్రైలర్‌.. రిలీజ్‌ చేసిన మహేష్‌.. హెచ్‌డీ క్వాలిటీ వాహ్‌

By Aithagoni Raju  |  First Published May 22, 2023, 7:56 PM IST

టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ల ట్రెండ్‌ నడుస్తుంది. తాజాగా సూపర్‌ స్టార్‌ కృష్ణ సినిమా `మోసగాళ్లకి మోసగాడు` కూడా రీ రిలీజ్‌ కాబోతుంది. తాజాగా మహేష్‌బాబు ట్రైలర్‌ని విడుదల చేశారు.
 


సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ప్రయోగాత్మక చిత్రం `మోసగాళ్లకి మోసగాడు`. ఇది యాభై రెండేళ్ల క్రితం వచ్చి సంచలనాత్మకంగా చిత్రంగా నిలిచింది. తెలుగులో వచ్చిన మొదటి కౌ బాయ్‌ ఫిల్మ్ కావడం విశేషం. కృష్ణకి, జోడీగా విజయ నిర్మల నటించింది. కేఎస్‌ఆర్‌ దాస్‌ దీనికి దర్శకత్వం వహించారు. స్క్రీన్‌ప్లే, రైటింగ్‌ ఆరుద్ర వర్క్ చేశారు. శ్రీ పద్మాలయ స్టూడియో పతాకంపై కృష్ణ సమర్పణలో ఆదిశేషగిరి రావు నిర్మించారు. 1971 ఆగస్ట్ 27న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. టాలీవుడ్‌లో ఓ కల్ట్ క్లాసిక్‌గా, కృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గానూ నిలిచింది. 

తాజాగాటాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ల ట్రెండ్‌ నడుస్తుంది. మహేష్‌బాబునేఈ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు. ఆయన నటించిన `పోకిరి`, `ఒక్కడు` లాంటి చిత్రాలను విడుదల చేశారు. పవన్‌, ఎన్టీఆర్‌, బాలకృష్ణ, చిరంజీవి, ప్రభాస్‌ సినిమాలు కూడా రీ రిలీజ్‌ చేశారు. వాటిలో `ఖుషి`, `సింహాద్రి`, `జల్సా` వంటి చిత్రాలు బంపర్‌ హిట్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కృష్ణగారి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని మే 31న ఆయన నటించిన `మోసగాళ్లకి మోసగాడు` చిత్రం రీ రిలీజ్‌ చేస్తున్నారు. భారీ స్థాయిలో దీన్ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. 

Latest Videos

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రీ రిలీజ్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు. 4కే ఆల్ట్రా హెచ్‌డీ క్వాలిటీతో ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్నారు. అందులో భాగంగా ట్రైలర్‌ కూడా అదే క్వాలిటీతో రూపొందించారు. సూపర్‌ స్టార్‌ మహేష్‌ ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇందులో కృష్ణ గుర్రంపై కౌబాయ్‌గా స్వారీ చేస్తూ వచ్చే సీన్‌ ఆకట్టుకుంటుంది. `మోసంతో ఆ అబ్బాయిని ఏం చేయలేం, వాడు మోసగాళ్లకే మోసగాడు` అని విలన్‌ చెప్పే డైలాగ్‌, చివరికి `మోసగాళ్లకి మోసగాడిని మాత్రమే కాదు, మంచి వాళ్లకి మంచివాడిని కూడా` అని చెప్పడంతో ట్రైలర్‌ ముగిసింది. షార్ట్ అండ్‌ స్వీట్‌గా ట్రైలర్‌ ఆకట్టుకునేలా ఉండటం విశేషం. 

ఇందులో ఇండియన్‌ ఫస్ట్ కౌబాయ్‌ ఫిల్మ్ అని, ఇది 60దేశాలకుపైగా రిలీజ్‌ అయ్యింది. దీంతో మొదటి తెలుగు పాన్‌ ఇండియా మూవీ అని` అని తెలియజేశారు. ఈ సినిమా 18వ శతాబ్దం బ్యాక్ డ్రాప్ లో బొబ్బిలి ప్రాంతంలో జరిగిన కథగా తెరకెక్కింది. అమరవీడు వంశానికి చెందిన కనిపించకుండా పోయిన ఓ నిధి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆ నిధి అన్వేషణలో కృష్ణకి ఎదురైన సవాళ్లు, ఆయన చేసిన యాక్షన్‌ ఆద్యంతం రక్తికట్టేలా, గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటాయి. మరి 4కే ఆల్ట్రా హెచ్‌డీ క్వాలిటీతో తాజాగా డిజైన్‌ చేసిన ఈ సినిమా థియేటర్లలో ఆడియెన్స్ కి ఎలాంటి ఫీలింగ్స్ నిస్తుందో చూడాలి. ఇక సూపర్‌ స్టార్‌ కృష్ణ గతేడాది నవంబర్‌ 15న అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
 

click me!