ప్రభుదేవా 'కృష్ణమనోహర్ ఐపీఎస్' టీజర్

Published : Feb 23, 2019, 02:50 PM IST
ప్రభుదేవా  'కృష్ణమనోహర్ ఐపీఎస్' టీజర్

సారాంశం

 ‘డ్యాన్సింగ్‌ కింగ్‌’ ప్రభుదేవా  నటుడుగానూ, దర్శకుడిగానూ వరస విజయాలు సాథించారు. సల్మాన్ ఖాన్ వంటి స్టార్ తో  హిందీలో హిట్ కొట్టి సంచలనం క్రియేట్ చేసారు.  అక్కడ స్టార్స్ తో వరస సినిమాలు చేసిన  ప్రభుదేవా, ఆ తరువాత చెన్నైకి తిరిగి వచ్చేసి మళ్లీ నటనవైపు దృష్టి పెట్టాడు. అప్పుడప్పుడు ప్రొడక్షన్  వైపు దృష్టి పెడుతూనే నటుడిగా బిజీ అవుతున్నాడు. 

ఈ నేపథ్యంలో తమిళంలో ఆయన చేసిన ఒక సినిమాను తెలుగులో 'కృష్ణమనోహర్ ఐపీఎస్' పేరుతో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుదేవా ఐపీఎస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన నివేదా పేతురాజ్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు. 

తనకి రైట్ అనిపించింది చేసుకుంటూ వెళ్లిపోయే ఐపీఎస్ ఆఫీసర్ గా ఈ టీజర్లో ప్రభుదేవా కనిపిస్తున్నాడు. ఆయన యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది. ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?