వీఎఫ్‌ఎక్స్‌ కోసం పవన్ ని రిక్వెస్ట్ చేసిన క్రిష్

By Surya Prakash  |  First Published Nov 10, 2020, 8:51 AM IST

దాన్ని విఎఫ్ఎక్స్ కు పంపతారట. అంటే జనవరి నుంచి ఏప్రియల్ దాకా ఖాళీగా ఉండటం కన్నా ఆ నాలుగు నెలలు పాటు విఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేసుకుంటారట. అప్పుడు షూట్ పూర్తయ్యాక డైరక్ట్ రిలీజ్ కు వెళ్లిపోవచ్చు. సినిమాలో విఎఫ్ ఎక్స్ సీన్స్ తక్కువే ఉండటంతో పది రోజులు షూట్ చేసి ఇస్తే చాలు అని అడిగారట. దాంతో పవన్ తను డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటానని చెప్పి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో జనవరి నుంచి ఓ మినీ షెడ్యూల్ క్రిష్ ప్లాన్ చేసినట్లు సమాచారం. 


ప్రస్తుతం దర్శకుడు క్రిష్ తన డైరక్షన్ లో రూపొందుతున్న వైష్ణవ్ తేజ్, రకుల్ కాంబో లో రూపొందుతున్న చిత్రం బాలెన్స్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఆ తర్వాత వెంటనే పవన్ సినిమా ప్రారంభించాలనున్నారు. అయితే పవన్ వరస సినిమాలు ఒప్పుకోవటంతో అవి ఫినిష్ చేసే దాకా క్రిష్ ప్రాజెక్టుకు రారు. అంటే ఏప్రియల్ 2020 దాకా ఈ ప్రాజెక్టు తిరిగి ప్రారంభం కాదు. అయితే క్రిష్ ఈలోగా చిన్న ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు పవన్ ని రిక్వెస్ట్ చేసారట. 

అదేమిటంటే..జనవరిలో ఓ పదిరోజులు పాటు మినీ షెడ్యూల్ ఫినిష్ చేస్తే ..దాన్ని విఎఫ్ఎక్స్ కు పంపతారట. అంటే జనవరి నుంచి ఏప్రియల్ దాకా ఖాళీగా ఉండటం కన్నా ఆ నాలుగు నెలలు పాటు విఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేసుకుంటారట. అప్పుడు షూట్ పూర్తయ్యాక డైరక్ట్ రిలీజ్ కు వెళ్లిపోవచ్చు. సినిమాలో విఎఫ్ ఎక్స్ సీన్స్ తక్కువే ఉండటంతో పది రోజులు షూట్ చేసి ఇస్తే చాలు అని అడిగారట. దాంతో పవన్ తను డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటానని చెప్పి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో జనవరి నుంచి ఓ మినీ షెడ్యూల్ క్రిష్ ప్లాన్ చేసినట్లు సమాచారం. 

Latest Videos

ఈ సినిమా కోసం హాలీవుడ్ నిపుణులు రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యం ఉన్న కథ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌ సన్నివేశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్  ఇస్తున్నారట మేకర్స్.  ‘ఆక్వామెన్‌’, ‘స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ VII-ది ఫోర్స్‌ అవేకన్స్‌’, ‘వార్‌క్రాఫ్ట్‌’ వంటి సినిమాలకు పనిచేసిన వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడు బెన్‌ లాక్‌ ఈ సినిమాకి పనిచేస్తున్నారని టాక్. 

  మరో ప్రక్క ఈ చిత్రం టైటిల్ పట్ల కూడా ఫ్యాన్స్ లో ఎంతో ఆసక్తి, కుతూహలం నెలకొన్నాయి. ఈ చిత్రానికి ‘ఓం శివమ్’​ అనే టైటిల్​ను ఫైనల్  చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేదు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్​ జాక్వెలిన్​ ఫెర్నాండేజ్​ పీకే సరసన నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పవన్​ ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఈ మూవీ మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారని తెలుస్తోంది. 

click me!