వీడియో లీక్, ఇరుక్కున్న శింబు,కేసు కోర్ట్ కు

By Surya Prakash  |  First Published Nov 10, 2020, 8:08 AM IST

షూటింగ్ స్పాట్ వీడియో అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఒక చిన్న చెట్టు మీద ఉన్న నాగు పామును శింబు జాగ్రత్తగా పట్టుకుని గోనె సంచిలో వేశారు. అయితే, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం సినిమాల్లో పాములను వాడకూడదు. 


వివాదాలు శింబు కు కొత్తేమీ కాదు కానీ ఇప్పుడు తాజాగా ఆయన ఇరుక్కున్న లీగల్ వివాదం మాత్రం కాస్త గట్టిగానే పీట ముడిపడిందని అంటున్నారు. అత్యుత్సాహంతో ప్రమోషన్ కోసం వదిలిన వీడియో ఇప్పుడు ఆయన్ని ఇరుకున పెట్టేసింది. దాంతో ఆయన దాన్ని నుంచి బయిటపడటానికి,తన సినిమాని బయిటపడేయటానికి లాయర్స్ ని ఆశ్రయించినట్లు సమాచారం. 

వివరాల్లోకి వెళితే..  తమిళ స్టార్ శింబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఈశ్వరన్’‌. సుశీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్టలుక్‌ - మోషన్‌ పోసర్ని చిత్రటీమ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో ‘ఈశ్వరుడు’గా అనువాదం అవుతోంది. మాధవ్‌ మీడియా - బాలాజీ కాప సమర్పణలో డీ కంపెనీ, కేవీ దురై సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈశ్వరన్ చిత్రాన్ని​ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రానున్న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  అంతబాగానే ఉంది కానీ...ఈ సినిమా షూటింగ్ నుంచి లీక్ అంటూ అనీఫిషియల్ గా బయిటకు వచ్చిన ఓ వీడియో ఈ టీమ్ ని ఇబ్బందుల్లో పడేస్తోంది. 

Latest Videos

‘ఈశ్వరుడు’ షూటింగ్ లో భాగంగా షూట్ చేసిన ఒక సీన్ ఇప్పుడు శింబును చిక్కుల్లో పడేసింది. ‘ఈశ్వరుడు’ షూటింగ్ స్పాట్ వీడియో అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఒక చిన్న చెట్టు మీద ఉన్న నాగు పామును శింబు జాగ్రత్తగా పట్టుకుని గోనె సంచిలో వేశారు. అయితే, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం సినిమాల్లో పాములను వాడకూడదు. అందుకే, చెన్నైకి చెందిన ఒక జంతు సంరక్షకుడు శింబుపై కేసు పెట్టారు. తన స్వార్థం కోసం పామును హింసించారని ఆరోపిస్తూ వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద శింబుపై ఆయన అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు.

దీంతో పాటు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో సైతం మరో కేసు శింబుపై నమోదైనట్టు సమాచారం. పాముకు మత్తు మందు ఇచ్చి షూటింగ్‌లో వాడినట్టు అనుమానిస్తూ వీడియో ఆధారంగా ఈ కేసు నమోదుచేశారని అంటున్నారు. అటవీ శాఖతో పాటు యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఈ కేసును విచారిస్తున్నాయి. కాగా, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ‘ఈశ్వరుడు’ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 

click me!