'అతడు అడవిని జయించాడు'.. స్టార్ హీరోతో డైరెక్టర్ క్రిష్ ప్రయోగం ?

pratap reddy   | Asianet News
Published : Oct 08, 2021, 10:04 AM IST
'అతడు అడవిని జయించాడు'.. స్టార్ హీరోతో డైరెక్టర్ క్రిష్ ప్రయోగం ?

సారాంశం

దర్శకుడు క్రిష్ తెరకెక్కించే చిత్రాలు ఆలోచింపజేసే విధంగా బలమైన సందేశంతో ఉంటాయి. అందుకే క్రిష్ టాలీవుడ్ లో ప్రత్యేకమైన దర్శకుడిగా నిలిచారు. క్రిష్ తెరకెక్కించిన కొండపొలం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

దర్శకుడు క్రిష్ తెరకెక్కించే చిత్రాలు ఆలోచింపజేసే విధంగా బలమైన సందేశంతో ఉంటాయి. అందుకే క్రిష్ టాలీవుడ్ లో ప్రత్యేకమైన దర్శకుడిగా నిలిచారు. క్రిష్ తెరకెక్కించిన కొండపొలం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రంపై మంచిఅంచనాలు ఉన్నాయి. గొర్రెల కాపరుల నేపథ్యంలో క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న హరి హర వీరమల్లు చిత్రానికి బ్రేక్ ఇచ్చి మరీ క్రిష్ కొండపొలం మూవీ ఫినిష్ చేశాడు. లాక్ డౌన్ టైంలో ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. గమ్యం, వేదం, కంచె ఇలా తన ప్రతి చిత్రంలో క్రిష్ ఏదో ఒక అంశాన్ని బలంగా హైలైట్ చేస్తారు. కొండపొలం కోసం గొర్రెల కాపరుల కథని ఎంచుకున్నారు. 

ఇక క్రిష్ తదుపరి చిత్రంపై ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. క్రిష్ ఎక్కువగా నవలలపై ఆసక్తి చూపుతుంటారు. డాక్టర్ కేశవ రెడ్డి రచించిన ' అతడు అడవిని జయించాడు' అనే నవల ఆధారంగా క్రిష్ తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని క్రిష్ విక్టరీ వెంకటేష్ తో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాతే పట్టాలెక్కాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో కుదర్లేదు. 

Also Read: కొండ పొలం ట్విట్టర్ రివ్యూ: అవార్డ్ విన్నింగ్ మూవీ అంటున్న మెగాస్టార్, నెటిజెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్

హరి హర వీరమల్లు తర్వాత 'అతడు అడవిని జయించాడు' తెరకెక్కించేందుకు క్రిష్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే ఇది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. Venkatesh హీరోగా స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాడట. ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్ 3 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. 

హరిహర వీరమల్లులో క్రిష్ పవన్ కళ్యాణ్ ని బందిపోటుగా చూపించబోతున్నాడు. ఔరంగజేబు కాలం నాటి పరిస్థితులతో క్రిష్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో హరి హర వీరమల్లు రిలీజ్ కానుంది. 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:జ్యోతో ఆడుకున్న కార్తీక్, సూరజ్-జ్యోని CEOగా పనికిరావన్న శివన్నారాయణ
Most Anticipated Film: పెద్ది, టాక్సిక్, రామాయణ చిత్రాలకు ఝలక్.. 2026లో మోస్ట్ అవైటెడ్ మూవీ ఇదే