సత్యదేవ్ హీరో, కొరటాల శివ సమర్పణ

Surya Prakash   | Asianet News
Published : Jul 04, 2021, 01:54 PM IST
సత్యదేవ్ హీరో, కొరటాల శివ సమర్పణ

సారాంశం

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివను ఈ మూవీ స్క్రిప్ట్‌ బాగా ఆకట్టుకోవడంతో… సత్యదేవ్ నటిస్తున్న ఈ చిత్రానికి ప్రెజెంటర్ గా మద్దతు ఇస్తున్నారు. సత్య దేవ్ విజయవాడకు చెందిన యువకుడి పాత్రలో నటించనుండగా, ఈ రస్టిక్ డ్రామాను విజయవాడ పరిసరాల్లో చిత్రీకరించనున్నారు.

తనదైన శైలి నటనతో, విభిన్నమైన కథల ఎంపికలో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్నారు సత్యదేవ్. ‘బ్లఫ్‌ మాస్టర్‌’, ’ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి  విలక్షణమైన సినిమాల్లో నటించిన సత్యదేవ్‌ త్వరలో ‘గాడ్సే’గా రానున్నారు. అదే క్రమంలో మరో సినిమా కమిటయ్యారు. ఇంకా పేరు పెట్టని ఆ సినిమాకు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్ఫించనున్నారు. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన వచ్చింది.  

 ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఇక ఈ చిత్రానికి వివి గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ ను విడుదల చేయగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ పోస్టర్ లో సత్యదేవ్ లాంగ్ హెయిర్ స్టైల్, భారీ గడ్డంతో కనిపిస్తున్నాడు. 

ఇక నిర్మాత  కృష్ణ కొమ్మలపాటి గతంలో సాయి ధరమ్ తేజ తో జవాన్ చిత్రం నిర్మించారు. ఆయన...కొరటాల శివకు మిత్రుడు కావటంతో ఈ చిత్రం నేరేషన్ విన్నారు. విన్నాక తనే స్వయంగా సమర్పిస్తాను అని చెప్పటం జరిగిందిట. సత్య దేవ్ విజయవాడకు చెందిన యువకుడి పాత్రలో నటించనుండగా, ఈ రస్టిక్ డ్రామాను విజయవాడ పరిసరాల్లో చిత్రీకరించనున్నారు.

కృష్ణ కొమ్మలపతి తన అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కాలా భైరవ, ఎడిటర్ నవీన్ నూలి వంటి అగ్ర సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. సత్యదేవ్ కు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
 
 

PREV
click me!

Recommended Stories

2025లో చిన్న సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. ఆ ముగ్గురిని అస్సలు మరచిపోలేరు
నాగార్జున సినిమాల్లో తనకు ఏమాత్రం నచ్చని ఏకైక మూవీ ఏదో తెలుసా?