చిరు 152 తర్వాత కొరటాల శివ భారీ స్కెచ్!

Published : Jun 27, 2019, 08:40 PM IST
చిరు 152 తర్వాత కొరటాల శివ భారీ స్కెచ్!

సారాంశం

పరాజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ. ఆయన తెరకెక్కించిన నాలుగు చిత్రాలు ఘనవిజయాలే. దీనితో కొరటాల శివ తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

పరాజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ. ఆయన తెరకెక్కించిన నాలుగు చిత్రాలు ఘనవిజయాలే. దీనితో కొరటాల శివ తదుపరి చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 

ఈ చిత్రం తర్వాత కొరటాల శివ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నారట. కొరటాల శివ తన స్నేహితులతో కలసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ స్టార్ హీరో ఈ చిత్రంలో హీరోగా నటిస్తాడట. హీరో, దర్శకుడు గురించి త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి. భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు కొరటాల శివ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. 

కొరటాల శివ దర్శకుడిగా కూడా తన సినిమాలకు నిర్మాత నుంచి షేర్ తీసుకుంటాడని టాక్. అలాంటిది ఇప్పుడు పూర్తి స్థాయిలో కొరటాల శివ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. దర్శకుడిగా టాప్ పొజిషన్ లో ఉన్న కొరత నిర్మాతగా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం