'ఆచార్య' షూటింగ్ ఎప్పుడు? ఓపెన్ గా చెప్పేసిన కొరటాల

By Surya PrakashFirst Published Aug 30, 2020, 8:14 AM IST
Highlights

ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలు కానుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే ప్రశ్నలు మెగాభిమానులకు కలుగుతున్నాయి. వాటికి కొరటాల శివ ...రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తేల్చి చెప్పారు. 

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆచార్య'... కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. షూటింగ్ మొదలైన కొత్తలో శరవేగంగా జరిగినా..ఆ తర్వాత కరోనా వైరస్ ఎఫెక్ట్ తో నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.  ఈ నేపధ్యంలో ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలు కానుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే ప్రశ్నలు మెగాభిమానులకు కలుగుతున్నాయి. వాటికి కొరటాల శివ ...రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తేల్చి చెప్పారు. 

కొరటాల శివ మాట్లాడుతూ...“ఆచార్య మళ్లీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే పెద్ద సినిమా ఇది. కనీసం 150 మంది పని చేస్తారు. పైగా అందరం క్లోజ్ గా వర్క్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి పెద్దవాళ్లు ఎవరైనా ఉన్నారా, ఆల్రెడీ జబ్బులు ఉన్నవాళ్లు ఎవరైనా ఉన్నారా అనే విషయం చూడాలి. అందుకే ఇంత తర్జన భర్జన,” అన్నారు బయట పెట్టాడు కొరటాల.

అలాగే “ముఖ్యంగా మాకు ధైర్యం రావాలి. ఒకవేళ ధైర్యం చేసి మేం త్వరగా షూటింగ్ పూర్తిచేసినా, థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత జనాలు వస్తారా రారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. రాబోయే 2 నెలల్లో అన్నింటిపై చిన్న క్లారిటీ వచ్చి ముందుకెళ్తామనే ఆశతో ఉన్నాను.” ఇది కొరటాల మాట.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు 40శాతం మాత్రమే షూటింగ్ పూర్తయింది. కొత్త షెడ్యూల్ ప్రారంభమైన వెంటనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ పై షూటింగ్ చేసేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది.

కొరటాల శివ కూడా రాజమోళి తరహాలోనే ఫ్లాఫ్ అనేది లేకుండా వరస హిట్స్ తో కెరీర్ ప్రారంభం నుంచీ దూసుకుపోతున్నారు. ఆయనతో పనిచేయానికి హీరోలంతా ఉత్సాహం చూపిస్తూంటారు. ఇటువంటి ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకోవటంతో ఆయనకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. హీరోలు...కొరటాల శివతో సినిమా అంటే ఉత్సాహం చూపిస్తారు కాబట్టి...నిర్మాతలు ఎంత ఇచ్చి అయినా కొరటాలని లాక్ చేయటానికి ప్రయత్నం చేస్తూంటారు. ఎందుకంటే కొరటాల సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడి మరీ సినిమాని సొంతం చేసుకుంటూంటారు.  

click me!