ఇండస్ట్రీలో మరో విషాదం.. కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి

By Satish ReddyFirst Published Aug 11, 2020, 12:01 PM IST
Highlights

కొద్ది రోజులుగా కరోనాతో ఇబ్బంది పడుతున్న స్వామినాథన్, చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆగస్టు 11 తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిర్మాతలు మురళీధరన్‌, వేణుగోపాల్ లాంటి నిర్మాతలతో కలిసి లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్‌ స్థాపించిన ఆయన 20 సంవత్సరాలుగా సినిమాలు నిర్మిస్తున్నారు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కరోనా బారిన పడగా ఇంకా లక్షల్లో కేసుల నమోదవుతున్నాయి. మన దేశంలోనూ కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. సాధారణ ప్రజలతో పాటు , సెలబ్రిటీలు కూడా కరోనాకు బలైపోతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా కారణంగా ప్రాణాలు విడువగా, తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు స్వామినాథన్‌ కరోనాతో మృతి చెందారు. ఆయన వయసు 64 సంవత్సరాలు.

కొద్ది రోజులుగా కరోనాతో ఇబ్బంది పడుతున్న స్వామినాథన్, చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆగస్టు 11 తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిర్మాతలు మురళీధరన్‌, వేణుగోపాల్ లాంటి నిర్మాతలతో కలిసి లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్‌ స్థాపించిన ఆయన 20 సంవత్సరాలుగా సినిమాలు నిర్మిస్తున్నారు.

అజిత్, విజయ్‌, కమల్ హాసన్, సూర్య, కార్తిక్‌ వంటి తమిళ స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించారు స్వామి నాథన్. ఆయన కుమారుడు అశ్విన్‌ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగుతున్నారు. స్వామినాథన్ మృతితో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాద చాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖుల ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేశారు.

click me!