
పుష్ప పార్ట్ 2 మూవీ గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.ఏదో ఒక అప్ డేట్ లేదా ఏదో ఒక రూమర్.. ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఇక తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్.. పుష్ప సినిమా గురించి వైరల్ అవుతోంది.
ఎప్పుడెప్పుడా అని అల్లు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పుష్ప మూవీ రిలీజ్.. ఇంకా ఏడాది ఉంది అని తెలిసి డిస్సపాయింట్ అయ్యారు బన్నీ ఫ్యాన్స్. ఈ ఏడాది ఇక అల్లు అర్జున్ ను థియేటర్ లో చూడలేము అని తెలిసి చాలా బాధపడుతున్నారు ఫ్యాన్స్. అయితే వచ్చే ఏడాది మాత్రం అల్లు అర్జున్ వెయ్యికోట్లు కలెక్షన్లు టార్గెట్ గా.. ఆస్కార్ కు వెళ్లడమే లక్ష్యంగా పుష్ఫ సీక్వెల్ ను అంతకు మించి తెరకెక్కిస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ లో కూడా ఓపిక పెరుగుతూ వస్తోంది. ఇక ఈక్రమంలో పుష్పకు సబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంది.
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా.. టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమాకు సీక్వెల్ గా దానికి మించిన గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప 2 కోసం అందరికీ తెలిసిందే. మరి దీనిని అయితే ఊహలకు మించిన మాస్ ఎలిమెంట్స్ తో దర్శకుడు సుకుమార్ విజన్ తో తెరకెక్కిస్తుండగా వస్తున్నా ఒకో అప్డేట్ తో అయితే సినిమా మరింత స్థాయిలోకి వెళ్తుంది.
ఇక ఇదిలా ఉండగా క్యాస్టింగ్ పరంగా కూడా ఈ సినిమా.. మరింత గ్రాండ్ గా మారుతుండగా లేటెస్ట్ గా అయితే ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం తమిళ స్టార్ హీరో కార్తీ పేరు పరిశీలనలోకి వచ్చినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి ఇంకా కార్తీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉందని టాక్. మరి ఇందులో ఎంతమేర నిజం ఉందో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే నిజం అయితే మూవీ టీమ్ కూడా ఈ విషయంలో స్పందించాల్సి ఉంది. ఒక వేళ నిజం అయితే.. డైరెక్ట్ గా పోస్టర్ ద్వారా కార్తీ క్యారెక్టర్ ను రివిల్ చేసేఅవకాశం కనిపిస్తోంది.