కొబ్బరిమట్టతో సంపూ రెడీ!

Published : Jun 20, 2019, 08:05 AM IST
కొబ్బరిమట్టతో సంపూ రెడీ!

సారాంశం

ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ కి సరికొత్త కిక్ ఇచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ తరువాత సంపూ చేసిన సినిమాలు పెద్దగా క్లిక్కవ్వలేదు. 

అయితే ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఆడియెన్స్ లో సంపూర్ణేష్ బాబు రేంజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. అసలు విషయంలోకి వస్తే మొత్తానికి ఈ బర్నింగ్ స్టార్ కొబ్బరిమట్ట సినిమాతో రెడీ అయ్యాడు. గత ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఫైనల్ గా జులై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

అసలైతే సినిమా అటకెక్కిందని అంతా భావించారు. కానీ చిత్ర యూనిట్ అతి కష్టం మీద సినిమాను వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. హృదయ కాలేయం మేకర్స్ రూపొందించిన ఈ సినిమాలో సంపూ మూడు విభిన్న పాత్రల్లో కనిపించ్చబోతున్నాడు. మరి ఈ సినిమా బర్నింగ్ స్టార్ కి ఏ రేంజ్ లో హిట్టిస్తుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Allu Arjun: పేరెంట్స్ చనిపోవడంతో హోటల్‌లో క్లాస్‌మేట్‌.. అల్లు అర్జున్‌ లైఫ్‌ని మార్చిన అమ్మ నిర్ణయం
120 కోట్ల ఒప్పందం రద్దు, దళపతి విజయ్ కి షాక్.. జన నాయగన్ విషయంలో అమెజాన్ ప్రైమ్ ఎందుకలా చేసింది?