కీర్తి సురేష్ అంత తీసుకుంటోందా...

Published : Mar 31, 2017, 02:15 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
కీర్తి సురేష్ అంత తీసుకుంటోందా...

సారాంశం

కీర్తి సురేశ్ క్రేజ్ అమాంతం ఆకాశానికి... ప్రస్థుతం పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ సినిమాతో పాటు.. మహానటి సావిత్రి సినిమాలోనూ టైటిల్ రోల్ రెమ్యునరేషన్  ఏ రేంజ్ లో ఉందంటే...

టాలీవుడ్ కు ఇటీవల పరిచయమైన అందమైన హీరోయిన్స్ లో ‘నేను శైలజ’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సుందరాంగి కీర్తి సురేష్‌ కూడా ఒకరు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది కీర్తి. ఇటీవల నాని హీరోగా వచ్చిన ‘నేను లోకల్‌’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా ముందు వరకు కీర్తి పారితోషికం 1.5 కోట్ల రూపాయలట. కానీ ఇప్పుడు కీర్తి రేంజ్ అమాంతం పెరిగి పోయింది.

 

తమిళంలో వరుస విజయాలను సాధిస్తున్న కీర్తి.. అక్కడ ఒక్కో సినిమాకూ 2 కోట్ల రూపాయలు తీసుకుంటుందట. ప్రస్తుతం కీర్తి సురేష్‌ ఖాతాలో రెండు పెద్ద తెలుగు సినిమాలు ఉన్నాయి. త్రివిక్రమ్‌, పవన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతోపాటు, సావిత్రి బయోపిక్‌ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమా కూడా కీర్తి చేస్తోంది. ‘మహానటి’ సినిమాకుగానూ కీర్తి సురేష్‌ మూడు కోట్ల రూపాయల పారితోషికం అందుకుందట. ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదల కానుంది. తెలుగుతో పోల్చుకుంటే కీర్తికి తమిళంలో మరింత పాపులారిటీ ఉంది. అందువల్ల కీర్తి ఇమేజ్‌తో తమిళనాట కూడా ‘మహానటి’ని భారీగా విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు. అందుకే కీర్తికి అడిగినంత పారితోషికం ఇచ్చారని సమాచారం.

PREV
click me!

Recommended Stories

తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది