
హీరో అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి ట్రెండీగా ఉంటారు. భారీ అభిమాన గణాన్ని మైంటైన్ చేస్తున్న స్నేహారెడ్డి ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేశారు. మొదట్లో చీరల్లో ఫోటో షూట్స్ చేసిన ఆమె స్కర్ట్స్, మిడ్డీలలో దర్శనమిస్తున్నారు. భర్త అల్లు అర్జున్ బర్త్ డే పార్టీలో ఆమె వేసుకున్న డ్రెస్ వివాదాస్పదం అయ్యింది. బాగా కురచగా ఉన్న బాడీ కాన్ డ్రెస్ లో స్నేహారెడ్డి సూపర్ హాట్ గా దర్శనమిచ్చారు. స్నేహారెడ్డి లుక్ ని యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుండగా... అల్లు అర్జున్ ఫ్యాన్స్ నొచ్చుకుంటున్నారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి బట్టలు ధరించకండి, ఒక వేళ వేసుకున్నా... పబ్లిక్ ఫ్లాట్ ఫార్మ్స్ లో పెట్టొద్దంటున్నారు. చెప్పాలంటే ఆమె మీద తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అల్లు అర్జున్ ఫాన్స్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అల్లు స్నేహారెడ్డి హీరోయిన్ మెటీరియల్. ఆమె ఒడ్డు పొడుగు, రూపంలో హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్. గత రెండేళ్లుగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. పెద్ద మొత్తంలో అభిమానులను సంపాదించారు. అల్లు స్నేహారెడ్డిని ఇంస్టాగ్రామ్ లో 8 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. హీరోయిన్స్ కి కూడా ఇంత మంది ఫాలోవర్స్ ఉండరు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె గ్లామర్ పవర్ ఏమిటో...
కాగా 2011 మార్చ్ 6న స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రేమను గెలిపించుకున్నారు ఈ జంట. స్నేహారెడ్డి ఫాదర్ శేఖర్ రెడ్డి ఈ పెళ్ళికి ఒప్పుకోలేదట. అయితే అల్లు అర్జున్ ని తప్పా ఎవరినీ వివాహం చేసుకోనని స్నేహారెడ్డి తెగేసి చెప్పారట. ఇక చేసేది లేక బన్నీని అల్లుడిగా శేఖర్ రెడ్డి ఒప్పుకున్నారు.టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, స్నేహారెడ్డి లకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు అయాన్, అమ్మాయి అర్హ. ఖాళీ సమయంలో పిల్లలతో హాయిగా ఆడుకోవడం బన్నీకి ఇష్టమైన వ్యాపకం. అర్హ శాకుంతలం మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.