
కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘సమ్మతమే’.అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో సాగే మ‍్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ . గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ్ నిర్మిస్తున్నారు. జూన్ 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇటీవల కొత్త టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఫెరఫెక్ట్ రొమాంటిక్ కామెడీగా అలరిస్తోంది.
” కృష్ణ అనే ఒక యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గ వర్క్ చేస్తుంటాడు. అతడికి పెళ్ళికి ప్రేమ అనేదానిమీద నమ్మకం ఉండదు. దీంతో ఎంతోమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో తనదగ్గరకు వచ్చినా కాదంటాడు. ఆ సమయంలో హీరోయిన్ ఎంటర్ అవుతుంది. ఆమెతో పరిచయం, స్నేహం వరకు దారి తీస్తుంది. ఆ స్నేహం, ప్రేమ అనే విషయం కృష్ణ కు తెలియడానికి చాలా టైమ్ పడుతుంది.
పెళ్ళికి ముందు ప్రేమంటే నాకు పడదు.. అందులో నేను పడను అంటూనే ప్రేమలో పడిన యువకుడు.. చివరికి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకున్నాడా..? వారి ప్రేమకు వచ్చిన ఇబ్బందులు ఏంటి..? అనేది కథగా తెలుస్తుంది. ‘ఆహ్లాదభరితంగా సాగే ప్రేమకథా చిత్రమిది. ఓ జంట ప్రయాణంలోని మధురానుభూతులకు దర్పణంలా ఉంటుంది. ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు..ఫస్ట్ గ్లింప్స్ అందరిని అలరిస్తున్నాయి’ అని చిత్రటీమ్ పేర్కొంది.
ఈ సినిమా టీమ్ చేసిన మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి. శేఖర్ చంద్ర ట్యూన్, కృష్ణకాంత్ సాహిత్యం ఈ సినిమాకి బాగా ప్లస్ కానున్నాయంటున్నారు. ఇక ఈ సినిమాలో కిరణ్, చాందినీ చౌదరీల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ అదిరిపోతుందంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌రెడ్డి మాసం, సంగీతం: శేఖర్‌చంద్ర, ఆర్ట్: సుధీర్ మాచర్ల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి.
కిరణ్ అబ్బవరం మొదటి సినిమా రాజా వారు రాణి గారు, రెండవ సినిమా ఎస్.ఆర్ కళ్యాణమండపం రెండు సినిమాలు మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి.థర్డ్ మూవీతో హ్యాట్రిక్ కొడతాడని అనుకున్న కిరణ్ కెరియర్ లో ఫస్ట్ టైం డిజాస్టర్ అందుకున్నాడు. సెబాస్టియన్ టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించినా సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. మరి ఈ సినిమాతో ఈ యంగ్ హీరో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.