తొలిప్రేమ అంత తోపేమీ కాదు.. మాటలతో మ్యాజిక్, కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ' గ్లింప్స్ వైరల్

Published : Jun 02, 2025, 11:19 PM IST
Chennai Love Story Glimpse

సారాంశం

'బేబీ' సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న రచయిత-దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ మళ్లీ కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించారు. 'చెన్నై లవ్ స్టోరీ' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా రానుంది.

కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'

'బేబీ' సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న రచయిత-దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కేఎన్ మళ్లీ కలిసి కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించారు. 'చెన్నై లవ్ స్టోరీ' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీగా రానుంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటిస్తున్నారు. మొదటి ప్రేమపై బేబీలో చెప్పిన సందేశాన్ని ఛాలెంజ్ చేసేలా ఈ చిత్రం కథాంశం ఉండబోతున్నట్లు గ్లింప్స్ ద్వారా అర్థం అయింది.

తొలిప్రేమ తోపేమీ కాదు

తాజాగా విడుదలైన గ్లింప్స్ లో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ సముద్రతీరాన కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ఈ సందర్భంగా శ్రీ గౌరి ప్రియ "బేబీ"లోని డైలాగ్‌ను ప్రస్తావించగా, కిరణ్ అబ్బవరం ఆసక్తికరంగా స్పందిస్తారు. “తొలిప్రేమ తోపేమీ కాదు” అని చెబుతూ.. మనసు, ప్రేమ గురించి మాటలతో మ్యాజిక్ చేస్తున్నాడు. 

ఆకట్టుకుంటున్న డైలాగులు 

"మొదటి ప్రేమ ఒక్కటే నిజమైతే అందరి ప్రేమలు తల్లి ప్రేమ దగ్గరే ఆగిపోయి ఉండాలి కదండీ" అంటూ కిరణ్ అబ్బవరం చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఒక ప్రేమ విఫలమైతే మరో అద్భుతమైన ప్రేమ ఎక్కడో ఎదురుచూస్తూనే ఉంటుంది అని కిరణ్ అబ్బవరం హీరోయిన్ కి చెప్పడం, దానికి ఆమె రియాక్షన్ చాలా బావుంది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. కథ, డైలాగ్స్ సాయి రాజేష్ అందించారు. సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు.

గ్లింప్స్ తో హైప్ 

ఈ చిత్రంలో మొదటి ప్రేమ అంటే ఏమిటో అనే ప్రశ్నకు కొత్త కోణాన్ని చూపించే ప్రయత్నం జరుగుతోంది. టీజర్ చూస్తేనే ఈ చిత్రానికి సంబంధించి వైవిధ్యం  స్పష్టమవుతోంది. బేబీ వంటి ఘన విజయానికి తర్వాత సాయి రాజేష్ తీసుకొస్తున్న ఈ ప్రేమ కథపై యువతలో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లింప్స్ తోనే అంచనాలు పెంచడం లో సక్సెస్ అయ్యారు. సినిమా విడుదల తేదీ ఇంకా వెల్లడించలేదు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth : 25 ఏళ్ల పాటు జపాన్ లో రికార్డు క్రియేట్ చేసిన ఏకైక ఇండియన్ హీరో
Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద