హీరో కిరణ్ అబ్బవరం నిర్మించిన 'తిమ్మరాజుపల్లి టీవీ' ట్రైలర్.. ఆ రోజులు గుర్తు చేసేలా ఉందిగా

Published : Apr 09, 2026, 09:15 PM IST
Kiran Abbavaram

సారాంశం

హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. ఈ చిత్ర ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ - అంతరించిపోయిన వస్తువులను మ్యూజియంలో పెడుతుంటారు. అలాంటి మ్యూజియం మీరు తెరపై చూడాలంటే మా సినిమాను ఈనెల 17న చూడండి. ఎందుకంటే మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. అందులో అంతరించిపోతున్న మన కల్చర్, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే ఎమోషన్స్ ను చూస్తారు. ఇది తిమ్మరాజుపల్లి స్టోరీ మాత్రమే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల వారి స్టోరీ. మొత్తం ఏపీ, తెలంగాణలో 40 ఫ్లస్ ఏజ్ ఉన్నవాళ్లు దాదాపు 5 కోట్ల మంది ఉంటారు. వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే వారి ఫ్యామిలీతో కలిసి చూస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ - మా మూవీ నుంచి రిలీజ్ చేసిన మూడు సాంగ్స్ మీకు నచ్చాయి. ట్రైలర్ లో మీరు చూసిన కంటెంట్ ను మించి సినిమాలో చూస్తారు. ఈ ఫ్యూరిటీ, ఎమోషన్స్ సినిమాలో ఇంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఫుల్ గా కనిపిస్తాయి. 35 రోజులు ఈ సినిమా కోసం షూటింగ్ చేశాం. చాలా మెమొరీస్ ఉన్నాయి. అవన్నీ ప్రీ రిలీజ్ లో చెబుతాను. మేమంతా డెడికేషన్ తో , సినిమా మీద ప్రేమతో, కిరణ్ గారు మా మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టాలని కష్టపడ్డాం. ఈ నెల 17న మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ తో మా సినిమా చూసేందుకు వెళ్లండి. అన్నారు.

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ - మన లైఫ్ లో మొదటిసారి ఎక్సిపీరియన్స్ చేసేవన్నీ ఒక మంచి ఫీల్ ను ఇస్తాయి. మొదటిసారి తిన్న అమ్మచేతి ముద్ద ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలా మన లైఫ్ లో చూసే స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రంలో అవకాశం కల్పించిన కిరణ్ అన్నకు థ్యాంక్స్. ఈ నెల 17న థియేటర్స్ లోకి మా మూవీ రాబోతోంది. తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు. నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - మా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇంటిల్లిపాదీ థియేటర్స్ కు వెళ్లేవాళ్లం. మా చిన్నతనంలో టీవీలో కొత్త సినిమా వచ్చినా, వీసీడీల్లో కొత్త మూవీ చూసినా ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటి హ్యాపీనెస్ ఇప్పటితరం వారికి చూపించాలనే అప్పటి హీరో, హీరోయిన్స్ గెటప్స్ లో ఈ రోజు మీ ముందుకు వచ్చాం. చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు నాకు బాగా ఇష్టం. అందుకే ఈ రోజు చెన్నకేశవరెడ్డి గెటప్ లో వచ్చాను. బాలకృష్ణ గారికి థ్యాంక్స్. అలాగే వింటేజ్ హీరోలందరికీ థ్యాంక్స్. మా చిత్రంలో పనిచేసిన వాళ్లందరి కల సినిమా. ఆ కల తీరేందుకు ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ పట్టింది. వాళ్లు మా మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు. ఇంత ప్యాషనేట్ టీమ్ చేసిన సినిమాను నేను హీరోగా చేసిన సినిమాలాగే ప్రమోట్ చేస్తున్నా. మేము కష్టపడ్డామని సినిమా చూడమని చెప్పను. నేను ప్రేక్షకుల టైమ్, డబ్బుకు విలువఇస్తాను. మా మూవీ ట్రైలర్, సాంగ్స్ , కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే థియేటర్స్ కు వెళ్లి మా టీమ్ అందరినీ సపోర్ట్ చేయండి. టెక్నికల్ బ్రిలియన్స్, ఆర్టిస్టుల బ్రహ్మాండమైన పర్ ఫార్మెన్స్ లు, ఊరిలోని ఆహ్లాదకరమైన వాతావారణం.. ఈ మూడు చూసేందుకు మా మూవీకి వెళ్లండి. ఈ వేసవికి సమ్మర్ వెకేషన్ ఊరికి వెళ్లినట్లే. ఈ సారి మా తిమ్మరాజుపల్లికి రండి. మీ ఊరు గుర్తుస్తుంది, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఇది నేను గ్యారెంటీ ఇస్తున్నా. 50 ఏళ్లు దాటిన వారికి మా సినిమా చాలా చాలా బాగా నచ్చుతుంది. టీవీ కొనేందుకు, టీవీ చూసేందుకు వాళ్లు ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు, ఎలాంటి అనుభూతులకు లోనయ్యారు అనేది వాళ్లకు మరోసారి గుర్తుకువస్తుంది. 30, 40 ఇయర్స్ లో ఉన్న వారికి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్లు ఫస్ట్ టీవీ కొని ఇంట్లో చూశారు కాబట్టి..ఆ మెమొరీస్ గుర్తుకువస్తాయి. ఈతరం యూత్ కు టీవీ అంటే పెద్దగా ఎమోషన్ కాదు. కానీ ఇప్పటి యూత్ మీ పేరెంట్స్ ను టీవీ గురించి, టీవీ వెనక ఉన్న ఎమోషన్ గురించి అడగండి. మా మూవీ చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు

నటీనటులు - సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raaka: రాకా.. ఏ భాషకు చెందిన పదం? అల్లు అర్జున్ సినిమాకు ఈ పేరే ఎందుకు పెట్టారు?
Ram Charan: పాపం అఖిల్ కి చుక్కలు చూపిస్తున్న రాంచరణ్..మళ్ళీ దెబ్బ తప్పదా ?