
హాలీవుడ్ చిత్రాల్లో అనేక ఫ్రాంఛైజీ చిత్రాలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రాలు భాష బేధం, లాంగ్వేజ్ బారియర్స్ ని ఎప్పుడో బ్రేక్ చేశాయి. వాటిలో ఒకటి `ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్` సిరీస్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆద్యంతం విజువల్ వండర్స్ గా రూపొందే ఈ చిత్రాలకు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అంతా అభిమానులే ఉన్నారు. విజువల్ ఫీస్ట్ లా ఈ మూవీస్ ఉండటంతో ఇండియన్ ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. బ్రహ్మరథ పండుతున్నారు.
ఇక అందులో భాగంగా ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ నుంచి ఇప్పుడు `కింగ్‌డమ్ ఆఫ్ ఆది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్` చిత్రం రూపొందింది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకి వెస్ బాల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ 20వ సెంచరీ స్టూడియో, ఇతర మూడు ప్రొడక్షన్ కంపెనీలతో కలిసి ఈ ఫిల్మ్ ని నిర్మించింది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. తెలుగులోనూ దీన్ని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో తెలుగు లాంగ్వేజ్‌లో టీజర్‌ని విడుదల చేశారు. ఇది `చారిత్రాత్మకమైన రోజూ` అంటూ గొరిల్లా జాతి ప్రకటించడం విశేషం. మనుషులపై గోరిల్లా విజయంగా ఇది సాగుతుందని తెలుస్తుంది.
అయితే టీజర్ ఆద్యంతం విజువల్ వండర్‌లా ఉంది. ఫారెస్ట్ లో ఓ వైపు మనుషులకు, గొరిల్లాలకు మధ్య అనుబంధం, అదే సమయంలో రెండు జాతుల మధ్య యుద్ధం వంటి సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఎమోషనల్‌గా ఉన్నాయి. ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ప్రతి ఫ్రేము విజువల్ వండర్‌లా ఉంది. వీటితో ప్రధానంగా ఎమోషన్స్, విజువల్స్ హైలైట్‌గా నిలుస్తాయి. అవే ఇండియన్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అదే కనిపిస్తుంది.
ఇందులో ప్రముఖ నటులు ఓవెన్ టీగ్యూ, ఫ్రెయా అల్లన్, కెవిన్ డురాండ్, ట్రావిష్ జెఫెరీ, పీటర్ మకాన్, విలయమ్ హెచ్ మాకీ ప్రధాన పాత్రల్లో నటించారు. కొందరు వాయిస్ అందించారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది మే 24న విడుదల కానుంది.