`కింగ్‌డమ్‌` ఫస్ట్ సాంగ్‌ ప్రోమో.. విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ కి పుల్‌ మసాలా

Published : Apr 30, 2025, 08:22 PM IST
`కింగ్‌డమ్‌` ఫస్ట్ సాంగ్‌ ప్రోమో.. విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ కి పుల్‌ మసాలా

సారాంశం

విజయ్‌ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా `కింగ్‌డమ్‌` మూవీ రూపొందుతుంది. గౌతమ్‌ తిన్ననూరి రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ ప్రోమో వచ్చింది. బీచ్‌ లో ఇద్దరు కూర్చొని ముద్దులు పెట్టుకోవడం హైలైట్‌గా నిలిచింది.   

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `కింగ్‌డమ్‌`. జస్ట్ గ్లింప్స్ తోనే పూనకాలు తెప్పించిందీ మూవీ. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో విడుదలకు నెల రోజుల నుంచే ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగా సినిమా నుంచి మొదటి పాటని విడుదల చేయబోతున్నారు. 

`కింగ్‌ డమ్‌` సినిమా ఫస్ట్ సింగిల్‌ ప్రోమోని విడుదల చేసింది టీమ్‌. `హృదయం లోపల` అంటూ సాగే పాట ప్రోమోని ఏప్రిల్‌ 30 బుధవారం విడుదల చేశారు. ఈ ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. ఇందులో బీచ్‌ వెంట విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ భాగ్య శ్రీ బోర్సే కూర్చొని ఉన్నారు. వారి లోపల గాఢమైన ప్రేమ ఉంది. ఇద్దరిని చూసుకుని ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్నారు. ఆ తర్వాత గ్యాప్‌ ఇచ్చి లిప్‌ లాక్‌లతో రెచ్చిపోయారు. 

ఈ క్రమంలో `చీకట్ల దారుల్లో..`అంటూ సాగే పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సముద్రపు ఒడ్డున భగ్న ప్రేమ కథని తెలియజేస్తుంది. ఈ పాటకి సంబంధించి `వారు జీవించడానికి ప్రేమని నకిలీ చేస్తారు. కానీ త్వరలో అది చాలా నిజమనిపిస్తుంది` అనే క్యాప్షన్‌ మరింత ఆసక్తికరంగా ఉంది. 

ఈ పాటని కేకే రాయగా, అనిరుధ్‌ రవిచందర్‌, అనుమిత నదేశన్‌ అలపించారు. అనిరుథ్‌ సంగీతం అందించారు. ప్రేమికులను ఆకట్టుకునేలా ఉన్న ఈ పాట ప్రోమో ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. అదే సమయంలో విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ కి మించి మసాలా అందించే పాటగా ఉండబోతుందని ప్రోమోలో విజువల్స్ ని చూస్తుంటే తెలుస్తుంది. పూర్తి పాటని మే 2న విడుదల చేయబోతున్నారు. 

ఇక విజయ్‌ దేవరకొండ, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్య్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. శ్రీలంక బ్యాక్‌ డ్రాప్‌లో ఒక కింగ్‌డమ్‌ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుందని తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?