ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' ట్రైలర్ వాయిదా.. పహల్గాం దాడి నేపథ్యంలో నిర్ణయం

Published : Apr 30, 2025, 03:23 PM IST
ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' ట్రైలర్ వాయిదా.. పహల్గాం దాడి నేపథ్యంలో నిర్ణయం

సారాంశం

ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' ట్రైలర్ వాయిదా పడింది. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, టీం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా 'తారే జమీన్ పర్' కి సీక్వెల్.

 ఆమిర్ ఖాన్ కంబ్యాక్ మూవీ 'సితారే జమీన్ పర్' ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి షాక్. ఈ వారం ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది.  సితారే జమీన్ పర్ ట్రైలర్ ని మే 1న రిలీజ్ చేసి.. అజయ్ దేవగన్ రైడ్ 2 మూవీ ప్రింట్స్ తో అటాచ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆమీర్ ఖాన్ అండ్ టీం ఈ చిత్ర ట్రైలర్ ని ఇప్పుడు లాంచ్ చేయడం లేదు. 

'సితారే జమీన్ పర్' ట్రైలర్ వాయిదా ఎందుకు?

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఆమిర్ ఖాన్ టీం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ దాడిలో 26 మంది చనిపోయారు, 10 మంది గాయపడ్డారు. దేశం మొత్తం దుఃఖంలో ఉంది. ఇలాంటి సమయంలో ట్రైలర్ రిలీజ్ చేయడం సరికాదని ఆమిర్ ఖాన్ భావించారు. కొన్ని రోజుల్లో ట్రైలర్ లాంచ్ డేట్ ని ఫిక్స్ చేసి ప్రకటిస్తారట. 

ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' గురించి

ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో, మూడేళ్ల తర్వాత ఆమిర్ ఖాన్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. 2022 'లాల్ సింగ్ చడ్డా' తర్వాత ఆయన సినిమా ఇదే. 18 ఏళ్ల క్రితం వచ్చిన 'తారే జమీన్ పర్' కి సీక్వెల్ ఇది. ఆ సినిమాలో ఆమిర్, దర్శీల్ సఫారీ, టిస్కా చోప్రా, విపిన్ శర్మ నటించారు. సీక్వెల్ లో ఆమిర్ తో పాటు దర్శీల్, జెనీలియా డిసౌజా కూడా నటిస్తున్నారు. జూన్ 20, 2025 న ఈ సినిమా రిలీజ్ కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి
Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?