ఆస్కార్ వరకు వెళ్లాం, ఇండియా చిత్ర పరిశ్రమకు రాజధానిగా హైదరాబాద్.. కింగ్ నాగార్జున కామెంట్స్

By Asianet News  |  First Published Oct 31, 2023, 6:44 PM IST

కింగ్ నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7కి హోస్ట్ గా చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'నా సామిరంగ'. చాలా రోజుల తర్వాత నాగార్జున కంప్లీట్ మాస్ లుక్ లో నటిస్తున్న చిత్రం ఇది.


కింగ్ నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7కి హోస్ట్ గా చేస్తూనే సినిమాల్లో నటిస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'నా సామిరంగ'. చాలా రోజుల తర్వాత నాగార్జున కంప్లీట్ మాస్ లుక్ లో నటిస్తున్న చిత్రం ఇది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా నాగార్జున ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్ పో కార్యక్రమంలో పాల్గొన్నారు. 

హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సినీ రంగానికి చెందిన 24 శాఖలకు చెందిన సరికొత్త సాంకేతికతను అందరికీ తెలియజేసే పరిచయ వేదికగా సినిమాటిక్ ఎక్స్ పో నిలిచింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేయగా..ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ అతిథిగా విచ్చేశారు. నాగార్జున ఈ కార్యక్రమంలో ఇండియన్ సినిమా గురించి, టాలీవుడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ సినిమాకి హైదరాబాద్ రాజధానిగా ఎదుగుతోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Latest Videos

కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘‘ఇప్పుడు రోజురోజుకూ టెక్నికల్‌గా ఎన్నో మార్పులు వస్తోంది. నన్ను ఈ కార్యక్రమానికి పిలవడం ఆనందంగా ఉంది. 1974లో అన్నపూర్ణ స్టూడియోను ప్రారంభించాం. నెలకు ఒక షూటింగ్ జరిగితే చాలనుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల పరిణామాలు వచ్చాయి. ఎంతో మారింది. హైదరాబాద్ అనేది సినిమా పరిశ్రమకు రాజధానిలా మారనుంది. సౌత్ ఫిల్మ్స్‌ని ఇండియా అంతా ఫాలో అవుతోంది. 

నాగ్ అశ్విన్ వంటి అద్భుతమైన దర్శకులు సత్తా చాటుతున్నారు. మేం ఆస్కార్ వరకు వెళ్లాం. ఇండియా జాయ్ వారి గ్రాఫ్ అద్భుతంగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, కార్యదర్శి జయేష్ రంజన్‌లు ఎంతో సహకరిస్తున్నారు. గేమింగ్, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ వంటి వారి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడకు రండి. మా అన్నపూర్ణ కాలేజ్‌లోనూ కోర్సులున్నాయి. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు థాంక్స్’’ అని అన్నారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘ఇండియా జాయ్ ఈవెంట్‌కు నన్ను పిలిచినందుకు థాంక్స్. నేను కూడా యానిమేషన్ కోర్సులు నేర్చుకున్నాను. వీఎఫ్‌ఎక్స్ కంపెనీల చుట్టూ కథలు పట్టుకుని తిరిగాను. హాలీవుడ్‌లాంటి క్వాలిటీతో సినిమాలు ఎందుకు చేయరని అడుగుతుంటారు. కానీ గత పదేళ్లుగా అద్భుతమైన క్వాలిటీతో సినిమాలు తీస్తున్నాం. హాలీవుడ్ వాళ్లు కూడా ఇక్కడకు వచ్చి చేస్తున్నారు. ప్రాజెక్ట్ కేని పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా మూవీలా ఇక్కడి వీఎఫ్ఎక్స్ కంపెనీలతోనే చేద్దామని ప్రయత్నించాను. నెక్ట్స్ మూవీని ఇక్కడి వాళ్లతో కలిసి హాలీవుడ్ కంటే బెస్ట్ క్వాలిటీతో తీస్తాను’’ అని అన్నారు.

click me!