బ్రహ్మాస్త్ర మూవీ షూటింగ్ పూర్తి చేసిన నాగార్జున!

Published : Feb 16, 2021, 12:30 PM IST
బ్రహ్మాస్త్ర మూవీ షూటింగ్ పూర్తి చేసిన నాగార్జున!

సారాంశం

బ్ర‌హ్మాస్త్ర  ఇండియాలోనే అతి భారీ బ‌డ్జెట్ సినిమా కాగా, ఈ చిత్రంలో న‌టించ‌డం త‌నకు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని, ఓ సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుడి మాదిరిగా తాను కూడా ఈ సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తున్న‌ట్లుగా ట్వీట్ చేశారు నాగ్. బ్రహ్మస్త్ర మూవీలో నాగార్జున విష్ణు పాత్ర చేస్తున్నారు.   

దర్శక నిర్మాత కరణ్ జోహార్ నటిస్తున్న భారీ చిత్రం బ్రహ్మాస్త్ర. హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా బ్రహ్మాస్త్ర విడుదల కానుంది‌. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ రూపొందిస్తున్న ఈ మోస్ట్ ఎవేటింగ్ సినిమాలో కింగ్ నాగార్జున న‌టిస్తున్నారు. అయితే తాజాగా నాగార్జున‌కి సంబంధించిన షూటింగ్ ముగిసిన‌ట్లుగా బ్ర‌హ్మ‌స్త్ర టీమ్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

 
ఇదే విష‌యాన్ని కింగ్ నాగార్జున త‌న అఫీషియల్ ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. బ్ర‌హ్మాస్త్ర  ఇండియాలోనే అతి భారీ బ‌డ్జెట్ సినిమా కాగా, ఈ చిత్రంలో న‌టించ‌డం త‌నకు చాలా ఆనందాన్ని ఇచ్చింద‌ని, ఓ సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుడి మాదిరిగా తాను కూడా ఈ సినిమా విడుద‌ల కోసం వేచి చూస్తున్న‌ట్లుగా ట్వీట్ చేశారు నాగ్. బ్రహ్మస్త్ర మూవీలో నాగార్జున విష్ణు పాత్ర చేస్తున్నారు. 

బ్రహ్మస్త్ర మూవీ టీం తో నాగార్జున ఫోటోలు దిగారు. అలియా భట్, రన్బీర్ కపూర్ దర్శకుడు అయాన్ ముఖర్జీలతో నాగార్జున ఫోటోలకు పోజిచ్చారు. అమితాబ్, నాగార్జున వంటి స్టార్ క్యాస్ట్ నటిస్తున్న ఈ చిత్రంలో ర‌ణ‌బీర్ కపూర్, డ్రీమ్ గర్ల్ అలీయ‌భ‌ట్ హీరో హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం బాంబే ఓ భారీ సెట్ లో న‌డుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి