ఆ క్రెడిట్ రాజమౌళిదే.. పహిల్వాన్ చిత్రం గురించి కిచ్చా సుదీప్!

Published : Sep 11, 2019, 06:57 PM IST
ఆ క్రెడిట్ రాజమౌళిదే.. పహిల్వాన్ చిత్రం గురించి కిచ్చా సుదీప్!

సారాంశం

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈగ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ఈగ చిత్రంలో సుదీప్ విలన్ పాత్రలో అదరగొట్టేశాడు. ఆ తర్వాత బాహుబలి ది బిగినింగ్ లో కూడా ఓ సన్నివేశంలో కనిపించాడు. ప్రస్తుతం సుదీప్ నటిస్తున్న పహిల్వాల్ చిత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

పహిల్వాన్ చిత్రం సౌత్ ఇండియన్ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది. ఎస్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియన్ ఫిలిం గా తెరకెక్కుతున్న పహిల్వాన్ పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. 

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సుదీప్ దర్శకధీరుడు రాజమౌళిని ప్రశంసించాడు. పహిల్వాన్ చిత్రం పాన్ ఇండియన్ మూవీగా  విడుదలవుతోంది అంటే అందుకు కారణం రాజమౌళి అని తెలిపాడు. రాజమౌళి ఈగ, బాహుబలి చిత్రాన్ని నన్ను నార్త్ ప్రేక్షకులకు కూడా చేరువ చేశాయి. 

రాజమౌళి గారు సౌత్ చిత్రాలకు ఉన్న బౌండరీలని చెరిపేశారు. బాలీవుడ్ లో సౌత్ ఇండియన్ సినిమాలు విడుదలవుతున్నాయంటే ఆ క్రెడిట్ రాజమౌళిదే అని సుదీప్ అభిప్రాయ పడ్డాడు. పహిల్వాన్ చిత్రంలో ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Nari Nari Naduma Murari Review: `నారీ నారీ నడుమ మురారి` మూవీ రివ్యూ.. శర్వానంద్‌ కి హిట్‌ పడిందా?
AALoki : అల్లు అర్జున్ దూకుడు, లోకేష్ కనగరాజ్ తో 23వ సినిమా ఫిక్స్, అఫీషియల్ అనౌన్స్ మెంట్