రెమ్యునరేషన్ కి రెక్కలొచ్చాయ్!

Published : Jun 26, 2019, 05:44 PM ISTUpdated : Jun 26, 2019, 05:47 PM IST
రెమ్యునరేషన్ కి రెక్కలొచ్చాయ్!

సారాంశం

కబీర్ సింగ్ ద్వారా కైరా అద్వానీ తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన ఆ సినిమా 100కోట్ల బాక్స్ ఆఫీస్ రికార్డ్ ను అందుకోవడానికి సిద్ధమైంది. సినిమాలో కైరా నటనకు మంచి మార్కులే పడ్డాయి. మొన్నటి వరకు ఛాలెంజిగ్ పాత్రల్లో కైరా నెగిటివ్ కామెంట్స్ ను అందుకుంది.   

కానీ ఇప్పుడు కబీర్ సింగ్ తో అమ్మడు విమర్శకుల నోళ్లు మూయించింది. అదే విధంగా అక్కడి స్టార్ హీరోయిన్స్ కి షాకిచ్చేల్లా అమ్మడి రెమ్యునరేషన్ కి రెక్కలొచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సినిమాలకే మొన్నటివరకు కోటికి పైగా డిమాండ్ చేసిన అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ రేట్ ని ఇంకాస్త పెంచినట్లు సమాచారం. 

రెమ్యునరేషన్ అంకెలు రెండు కోట్ల వరకు వచ్చినట్లు బాలీవుడ్ లో కథనాలు వెలువడుతున్నాయి. కరణ్ జోహార్ తో పాటు మరో ఇద్దరు బడా నిర్మాతలు బేబీ అడిగినంత ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇక కైరా ప్రస్తుతం నాలుగు హిందీ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే కోలీవుడ్ - టాలీవుడ్ కథలను కూడా వింటున్న ఈ భామ సౌత్ లో కూడా బిజీ కానున్నట్లు టాక్.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?