క్యూట్ పిల్లని కల్కి కరుణిస్తాడా?

Published : Jun 26, 2019, 04:54 PM IST
క్యూట్ పిల్లని కల్కి కరుణిస్తాడా?

సారాంశం

రాజశేఖర్ నటించిన థ్రిల్లర్ డ్రామా కల్కి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో నటించిన హీరోయిన్ అదా శర్మా సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది.

రాజశేఖర్ నటించిన థ్రిల్లర్ డ్రామా కల్కి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో నటించిన హీరోయిన్ అదా శర్మా సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే బేబీకి కెరీర్ లో ఇప్పటి వరకు సరైన హిట్ తగల్లేదు. 

సోలో హీరోయిన్ గా అవకాశాలు కూడా తగ్గాయి. గ్లామర్ తో అలా అలా కెరీర్ ను నెట్టుకొస్తున్నప్పటికీ అదా సంతృప్తి చెందడం లేదు.  అయితే కల్కిలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో హిట్టయితే కాస్త పేరొస్తుందని స్టార్ హీరోస్ తో అవకాశాలు అందుకోవచ్చని అదా ఆశపడుతోంది. 

అదా శర్మ చేతిలో మరో మూడు సినిమాలుకూడా ఉన్నాయి. బాలీవుడ్ లో కమాండో 3తో పాటు మరో రెండు సినిమాలు చేస్తోంది. ఇక సౌత్ లో అవకాశాలు పెరగాలంటే అమ్మడు ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాల్సిందే. మరి కల్కి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించారు.    

PREV
click me!

Recommended Stories

ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
AggiPetti Macha: అగ్గి పెట్టి మచ్చ కిరణ్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సోషల్ మీడియా కమెడియన్