నటుడు రవి మోహన్, అతని భార్య ఆర్తి మధ్య విడాకుల వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. వేర్వేరుగా జీవిస్తున్నారు. రవిమోహన్ తండ్రిగా తన బాధ్యతలని మర్చిపోతున్నాడు అంటూ ఆర్తి ఎమోషనల్ గా ఆరోపణలు చేసింది.
నటుడు రవి మోహన్, అతని భార్య ఆర్తి మధ్య విడాకుల వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. వేర్వేరుగా జీవిస్తున్నారు. రవిమోహన్ తండ్రిగా తన బాధ్యతలని మర్చిపోతున్నాడు అంటూ ఆర్తి ఎమోషనల్ గా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్తికి ప్రముఖ నటి ఖుష్బూ సుందర్, రాధికా శరత్ కుమార్ మద్దతు ప్రకటించారు. ఇటీవల రవి మోహన్ తన గాయకురాలు కెనిషా ఫ్రాన్సిస్‌తో కలిసి ఒక వివాహ వేడుకకు హాజరవడం నేపథ్యంలో అనేక రూమర్స్ మొదలయ్యాయి. .
గత ఏడాది రవి, ఆర్తి ఇద్దరూ తమ విడిపోవడం గురించి పబ్లిక్‌గా వాగ్వివాదానికి దిగారు. ప్రస్తుతం వారి విడాకుల న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. శుక్రవారం చెన్నైలో జరిగిన నిర్మాత ఇసారి గణేష్ కుమార్తె పెళ్లిలో, రవి-కెనిషా జంటగా కనిపించడం వారి మధ్య ఉన్న సంబంధంపై పలు ఊహాగానాలకు దారితీసింది. గతంలో ఈ ఇద్దరూ తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినప్పటికీ, ఇప్పుడు కలిసి హాజరవడం చర్చనీయాంశమైంది.వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఈ పరిణామాల తర్వాత, ఆర్తి ఒక బలమైన ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆమె, రవి తండ్రిగా తన బాధ్యతల్ని విస్మరించాడని ఆరోపించారు. "నా ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్‌ను ఎలాంటి భావోద్వేగ, ఆర్థిక మద్దతు లేకుండానే పెంచుతున్నాను. నాకు ఎదురైన ఆరోపణలు, విమర్శలను సహిస్తూ వచ్చాను. పిల్లలకు తల్లిదండ్రులలో ఎవరిని ఎంచుకోవాలి అనే ఒత్తిడి ఉండకూడదు" అని పేర్కొన్నారు.
ఆమె మరో ముఖ్యమైన విషయాన్ని మీడియాకు తెలియజేశారు. "నా ఇన్‌స్టాగ్రామ్ పేరు గురించి చింతిస్తున్న వారికి – నేను ఇంకా ఆర్తి రవినే . నేనూ, చట్టం కూడా వేరేలా నిర్ణయం తీసుకునేంతవరకూ మళ్లీ ఆ పేరే ఉంటుంది. మీడియా , ప్రజలు నన్ను ఎక్స్ వైఫ్ అని పిలవొద్దు." అని కోరారు.
ఆమె పంచిన ఈ ప్రకటనకు ఖుష్బూ స్పందిస్తూ, "ఒక తల్లి చెప్పే నిజం కాలంతో పాటు సాక్షిగా నిలుస్తుంది." అని ట్వీట్ చేశారు. అలాగే రాధికా శరత్ కుమార్ కూడా ప్రకటనను పంచుతూ బలాన్ని సూచించే ఎమోజీనిషేర్ చేశారు.
A mother. ❤️ https://t.co/PsMvNkh4ev
— KhushbuSundar (@khushsundar)ప్రస్తుతం ఆర్తి తన ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తోంది. రవి మోహన్‌తో జరిగిన విడాకుల ప్రక్రియ ఇంకా న్యాయస్థానాల్లో కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో ఆమెకు సినీ ప్రముఖుల మద్దతు అందడం గమనార్హం.