ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్.."స్వీట్ ఛేంజ్"

Published : Jan 02, 2017, 01:43 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్.."స్వీట్ ఛేంజ్"

సారాంశం

మెగా స్టార్ ఖైదీ నెంబర్ 150 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఉత్కంఠ వేదిక మార్చుకోవాలని సూచించిన ప్రభుత్వం మెగా ఈవెంట్ వేదిక గుంటూరుకు మార్చే యోచనలో నిర్మాత రామ్ చరణ్

మెగాస్టార్ 150వ చిత్రం, మెగా ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఖైదీ నెంబర్ 150 చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో గ్రాండ్ గా జరుగుతుందని అంతా అనుకున్నాం. అయితే... రకరకాల సాకులతో ఈ ఈవెంట్ కు అనుమతి నిరాకరిస్తుండడంతో... ఈవెంట్ డేట్ తో పాటు వెన్యూ కూడా మారే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ ఇందిరా స్టేడియంలో అనుమతి నిరాకరించడంతో ఇక వేడుక వేదికను గుంటూరుకు మార్చాలని ఫిక్స్ అయ్యారు నిర్మాత రామ్ చరణ్. 

 

నిజానికి మెగాస్టార్ 'ఖైదీ నెం.150' చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ వేడుక జనవరి 4న విజయవాడలో జరపడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించడానికి రాంచరణ్ పక్కాగా రంగం సిద్ధం చేస్తున్నాడట. విజయవాడలో అనుమతిపై సర్కారు, పోలీసులు బెట్టు చేస్తుండటంతో 'ఖైదీ నెం.150' వేడుక సినిమాకి సంబంధించిన వేడుక వెన్యూ మార్చి నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నందుకు కారణంగా.. హైకోర్టు ఆర్డర్స్ చూపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 


అలా 'ఖైదీ నెం.150' ఫ్రీ రిలీజ్ వేడుకకు ఎలాంటి ఆటంకం ఉండదని తెలుస్తోంది. గుంటూరులో ఫ్రీ రిలీజ్ వేడుకను జరపాలనుకుంటున్నారట. కాకపోతే 4వ తారీఖున కాకుండా, ఈ వారం చివరిలో ఈ వేడుక జరిగే అవకాశముందని సమాచారమ్. విశేషమేంటంటే... 4వ తారీఖున ఈ వేడుకను జరపకుండా, ఈ వారం చివరిలో డేట్ ఫిక్స్ చేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. అదే జరిగితే మెగాభిమానులకు గుడ్ న్యూసే. ఏం జరుగుతుందో..ఎలా జరుగుతుందో చూద్దాం.

PREV
click me!

Recommended Stories

శ్రీదేవి బిగ్గెస్ట్ సూపర్ స్టార్, ఒప్పుకుంటా.. కానీ నాకు కూడా ఒక చరిత్ర ఉంది, నయనతార షాకింగ్ కామెంట్స్
Chiranjeevi చించేశాడు, బాస్‌ ఈజ్‌ బాస్‌.. `మన శంకర వరప్రసాద్‌ గారు` మూవీపై అరవింద్‌ క్రేజీ రివ్యూ