ఖాన్ లను ఈడ్చికొట్టిన 2018

By Prashanth MFirst Published Dec 26, 2018, 3:09 PM IST
Highlights

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎక్కువగా డామినేట్ చేసే ఖాన్ త్రయం చరిత్రలో మొదటి సారి ఒకే ఏడాదిలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ని చవిచూసింది. సల్మాన్ ఖాన్ - అమిర్ లకు ఇది ఊహించని డెబ్బైతే.. షారుక్ కి ఇది చావు దెబ్బ అని చెప్పాలి. 

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎక్కువగా డామినేట్ చేసే ఖాన్ త్రయం చరిత్రలో మొదటి సారి ఒకే ఏడాదిలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ని చవిచూసింది. సల్మాన్ ఖాన్ - అమిర్ లకు ఇది ఊహించని డెబ్బైతే.. షారుక్ కి ఇది చావు దెబ్బ అని చెప్పాలి. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో టాప్ 3 నెంబర్స్ లో ఖాన్ త్రయం నిత్యం పోటీ పడేది. కానీ 2018 ఏడాది ముగ్గురిని ఈడ్చికొట్టింది.  

బాక్స్ ఆఫీస్ దగ్గరకి రాకుండా దరిద్రం అదృష్టంలా అడ్డు పడింది. మొదటగా కండలవీరుడు సల్మాన్ ఖాన్ రేస్ 3 తో అంచనాలను భారీగా పెంచి ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. ఆ సినిమా  ఓపెనింగ్స్ అయితే అందుకోగలిగింది గాని హిట్టు మాత్రం అందలేదు. ఇక దీపావళికి మరింత హైప్ క్రియేట్ చేసి అమిర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాను విడుదల చేశాడు. 

ఇతర భాషల్లో కూడా విడుదలైన ఆ సినిమా బాహుబలి రికార్డులను తిరగరాస్తుందని అనుకున్నారు. కానీ మొదటి షోకే మ్యాటర్ క్లియర్ గా అర్ధమయ్యింది. గత 15 ఏళ్లుగా ప్లాప్ అంటే తెలియని అమిర్ కు ఆ సినిమా తీరని నష్టాన్ని మిగిల్చింది. ఇక మరో ఖాన్ షారుక్ 2018 చివరలో జీరో సినిమా రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత జీరో అయ్యాడు. 

గత కొంత కాలంగా షారుక్ సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి.  ఇక జీరో సినిమా కనీసం చిన్న సినిమాలు అందుకున్న ఓపెనింగ్స్ ను అందుకోకపోవడం గమనార్హం. దీంతో అతని కెరీర్ పై అనుమానాలు మొదలయాయ్యయి. మొత్తానికి 2018 లో ఖాన్ త్రయం స్టామినా విఫలమైంది. మరి నెక్స్  ఈయర్ లో అయినా వీరు హిట్ అందుకుంటారో లేదో చూడాలి.    

click me!