కేజీఎఫ్‌ 2 రీస్టార్ట్ అప్పుడే.. సంజయ్‌ దత్‌ వస్తాడా?

Published : Aug 21, 2020, 01:56 PM ISTUpdated : Aug 21, 2020, 01:57 PM IST
కేజీఎఫ్‌ 2 రీస్టార్ట్ అప్పుడే.. సంజయ్‌ దత్‌ వస్తాడా?

సారాంశం

కరోనా వల్ల షూటింగ్‌లన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా షూటింగ్‌లు పునప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా `కేజీఎఫ్‌ 2` కూడా రీస్టార్ట్ కావడానికి రెడీ అవుతుంది. 

చిన్న సినిమాగా తెరకెక్కి ఇండియన్‌ బాక్సాఫీస్‌ని షేక్‌ చేసిన కన్నడ చిత్రం `కేజీఎఫ్‌`. ఈ సినిమాతోనే దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దేశ వ్యాప్తంగా పాపులర్‌ అయ్యారు. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు. ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌, యశ్‌ స్టయిలీష్‌ యాక్టింగ్‌ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. పాన్‌ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లని రాబట్టింది. 

దీనికి కొనసాగింపుగా రెండో భాగం `కేజీఎఫ్‌ఃఛాప్టర్‌ 2` రూపొందుతుంది. ఇందులో మెయిన్‌ విలన్‌గా బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు రవీనా టండన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో సినిమా రేంజ్‌ మారిపోయింది. మరింత అంచనాలు పెరుగుతున్నాయి. 

ఇదిలా ఉంటే కరోనా వల్ల షూటింగ్‌లన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా షూటింగ్‌లు పునప్రారంభించబోతున్నారు. అందులో భాగంగా `కేజీఎఫ్‌ 2` కూడా రీస్టార్ట్ కావడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాని ఈ నెల 26 నుంచి తిరిగి షూటింగ్‌ ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది.  `త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. లోకేషన్‌ని ఊహించండి` అని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ గురువారం ట్వీట్‌ చేశారు. 

దీంతో షూటింగ్‌ గురువారమే ప్రారంభమైందని అంతా అనుకున్నారు. కానీ అది నిజం కాదని సహనిర్మాత కార్తీక్‌ గౌడ తెలిపారు. ఆయన ట్వీట్‌ చేస్తూ ఈ నెల 26 నుంచి తిరిగి పున ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ సినిమా దాదాపు చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. సంజయ్‌ దత్‌, యశ్‌లపై యాక్షన్‌ సన్నివేశాలు, పలు సీన్స్ తీయాల్సి ఉందని అన్నారు. అయితే ఇటీవల సంజయ్‌ దత్‌ లంగ్‌ కాన్సర్‌కి గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చిత్ర షూటింగ్‌లో పాల్గొంటాడా? అన్నది సస్పెన్స్ గా మారింది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

సుజీత్ కి పవన్ కారు గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో తెలుసా ? అంత పెద్ద త్యాగం చేశాడా, హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
The Raja Saab: ప్రభాస్ రాజాసాబ్ సాంగ్ పై విపరీతంగా ట్రోలింగ్.. వర్షం, డార్లింగ్ సినిమాలు వైరల్