ఫార్మ్ హౌస్ నిర్మాణ పనుల్లో కెజిఎఫ్ హీరో యష్!

By team teluguFirst Published Apr 12, 2021, 3:14 PM IST
Highlights

ఇక కన్నడ పాన్ ఇండియా స్టార్ యష్ కొత్తగా పొలం కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలో ఆయన విశాలమైన ల్యాండ్ కొనడం జరిగింది. తన పొలం చుట్టూ ఇప్పటికే కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది.

కోట్ల సంపాదన కలిగిన స్టార్ హీరోలకు ఫార్మ్ హౌస్ లు ఏర్పాటు చేసుకోవడం ఒక సరదా. ఎవరికీ ప్రవేశం లేని వందల ఎకరాల్లో తమకు ఇష్టమైన మొక్కలు, జంతులను పెంచుకుంటూ ఉంటారు. కొందరైతే ఆ ఫార్మ్ హౌస్ లో ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండ్లు, కూరగాయలు పండించి, స్వచ్ఛమైన ఆహారం తింటూ ఉంటారు. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలకు నగర శివార్లలో ఫార్మ్ హౌస్ లో ఉన్నాయి. 


ఇక కన్నడ పాన్ ఇండియా స్టార్ యష్ కొత్తగా పొలం కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలో ఆయన విశాలమైన ల్యాండ్ కొనడం జరిగింది. తన పొలం చుట్టూ ఇప్పటికే కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. ఆ భూమిని వ్యవసాయానికి, మొక్కలు పెంపకానికి అనువుగా దగ్గరుండి స్వయంగా పనులు చేయిస్తున్నారు యష్. ఫార్మ్ హౌస్ లో జేసీబీలతో వర్క్ చేయిస్తున్న యష్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. 


ఇక కెజిఎఫ్ 2 షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జులై 16వ తేదీన వరల్డ్ వైడ్ గా పలు బాషలలో కెజిఎఫ్ 2 విడుదల కానుంది. యష్ బర్త్ డే కానుకగా విడుదలైన టీజర్ రికార్డుల మోతమోగించింది. కెజిఎఫ్ చాప్టర్ 2లో ప్రకాష్ రాజ్, రావు రమేష్ వంటి నటులు కీలక రోల్స్ చేయడం విశేషం. దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి భాగానికి మించి, భారీగా కెజిఎఫ్ 2 తెరకెక్కించారని సమాచారం. ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ రోల్ చేసిన విషయం తెలిసిందే. 
 

click me!