ఎన్టీఆర్ మరోసారి స్మాల్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. నాగార్జున అప్పట్లో హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షోను హోస్ట్ చేయబోతున్నట్టు జెమినీ టీవీ అఫీషియల్‌గా ప్రకటించింది. ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ .. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమోను రెడీ చేస్తున్నాడు. జెమినీ వారు అఫీషియల్ గా ఎన్టీఆర్ లుక్ ని ప్రమోతో మార్చి 13న విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంది. అయితే జెమినీ గ్రూప్ కు చెందిన సన్ నెక్ట్స్ ఓటీటి యాప్ వారు ఆల్రెడీ ఈ లుక్ ని పోస్ట్ చేసి ప్రచారం ప్రారంభించేసారు. దాంతో ఈ ఫస్ట్ లుక్ ముందే లీకైనట్లైంది. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతోంది.

ఇక 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ గతంలో నాగార్జున, చిరంజీవి అలరించిన విషయం తెలిసిందే. ఈసారి ఈ కార్యక్రమం 'ఎవరు మీలో కోటీశ్వరుడు' పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, ఈ కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిది. రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమోలో చైర్‌లో హోస్ట్ కూర్చుని ఉన్నాడు. అయితే, ఆయన ముఖాన్ని నేరు చూపకుండా నీడలా చూపించారు. దాన్ని గమనించి చూస్తే ఎన్టీఆర్ ఆ కుర్చీలో కూర్చున్నట్లు అర్థమవుతోంది.
అప్పట్లో ఎన్టీఆర్‌కు బిగ్ బాస్ సీజన్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనుభవం ఉంది. 'ఎవరు మీలో కోటీశ్వరుడు'కు సంబంధించిన ప్రోమో కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ షో నిమిత్తం జూనియర్ ఎన్టీఆర్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'ఎవరు మీలో కోటీశ్వరుడు'కు సంబంధించిన పూర్తి స్థాయి ప్రోమో త్వరలోనే విడుదల కానుంది.