రాజమౌళి సినిమా చేసేలోగా మహేష్ ఇంకోటి,డైరక్టర్ ఖరారు

By Surya Prakash  |  First Published Mar 9, 2021, 8:18 PM IST

మహేష్ బాబు త్వరలో రాజమౌళితో సినిమా చేయబోతున్నారనే వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజమౌళి పూర్తిగా తన తాజా ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. ఆయన వాటిని ముగించుకుని వచ్చేలోగా మహేష్ ఓ సినిమాని స్పీడుగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే చాలా కాలం డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వెంటనే స్పీడుగా తనతో సినిమా చేసే దర్శకుడుగా అనీల్ రావిపూడి కనిపించారు. అనీల్ రావిపూడి సైతం తన ఎఫ్ 3 సినిమా తర్వాత కొత్తవి ఏమీ ఒప్పుకోలేదు. ఈ క్రమంలో వీళ్లిద్దరు కలిసి పనిచేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. 

గతంలో సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ మొత్తం ఐదున్నర నెలల్లో పూర్తైంది. ఆ సినిమా మహేష్ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో అక్టోబర్ నుంచి కానీ నవంబర్ నుంచి కానీ ఈ సినిమా పూర్తి చేసి, వచ్చే సంవత్సరం విడుదల చేయాలనే ఆలోచనలో మహేష్ ఉన్నట్లు సమాచారం. 

Latest Videos

అనీల్ రావిపూడి మాట్లాడుతూ...మ‌హేష్ బాబు గారితో మ‌రో సినిమా డిస్కషన్ స్టేజ్‌లో ఉంది. అలాగే రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. వీటితో పాటు ఓ లేడీ ఓరియంటెడ్‌ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చేద్దామనుకున్నాను. భవిష్యత్‌లో త‌ప్పకుండా ఓ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చేస్తాను అన్నారు.

ఇక ‘ప‌టాస్’, ‘సుప్రీమ్‌’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘స‌రిలేరు నీకెవ్వరు’.. ఇలా ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి, వ‌రుసగా ఐదు బ్లాక్ బ‌స్టర్స్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ‘ఎఫ్3’ చిత్రానికి ద‌ర్శక‌త్వం వహిస్తున్నారు. తన లాంటి స్టార్ డైరెక్టర్ ప్రమేయం ఉంటే చిన్న సినిమాను కూడా పెద్ద సినిమాగా మార్చొచ్చు అని ‘గాలి సంపత్’ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా మారారు. అంతటితో తన బాధ్యతను వదిలించుకోకుండా ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ చేశారు.
 
click me!