VijayaKanth: విజయ్ కాంత్ అనారోగ్యంపై స్పందించిన హీరో సూర్య, ఏమన్నారంటే..?

Published : Dec 04, 2023, 01:05 PM ISTUpdated : Dec 04, 2023, 01:06 PM IST
VijayaKanth: విజయ్ కాంత్  అనారోగ్యంపై స్పందించిన హీరో సూర్య, ఏమన్నారంటే..?

సారాంశం

గత కొంత కాలంగా తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ హాస్పిటల్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంపై రకరకాల వదంతులు, వార్తలు వైరల్ అవ్వగా.. తాజాగా విజయ్ కాంత్ అనారోగ్యం గురించి స్పందించారు మరో స్టార్ హీరో సూర్య. ఆయన ఏమన్నారంటే..? 

తమిళనాట సూపర్ స్టార్ హీరోగా లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకున్న హీరోలలో  విజయ్ కాంత్ ఒకరు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఇంటికే పరిమితం అవ్వగా.. ఎన్నోసార్లు ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించి.. మళ్ళీ కోలుకున్నారు.. ఇక తాజాగా మరోసారి విజయ్ కాంత్ అనారోగ్యంతో హాస్పటల్ లో చేరిన విషయం తెలిసిందే. గతకొంతకాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీఎండీకే అధినేతగా ఉన్న  విజయకాంత్.. జ్వరం, జలుబుతో హస్పిటల్ లో చేరారు. వెంటనే డిశ్చార్జ్ అవుతారు అనుకుంటే.. పరిస్థితి సీరియస్ గా మారి.. గత 15 రోజులుగా హాస్పిటల్ కే పరిమితం అయ్యారు విజయ్ కాంత్. 

ఈక్రమంలో విజయ్ కాంత్ ఆరోగ్యం పై ఎప్పటికప్పుడు వైద్యులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. విజయ్ కాంత్ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలుపుతున్నారు.అయితే  సోషల్ మీడియాలో మాత్రం స్టార్ సీనియర్ హీరో పై రకరకాల న్యూస్ లు వైరల్ అయ్యాయి. విజయ్ కాంత్ మరణించినట్టు కూడా కొంత మంది ప్రాచారం చేశారు. ఆయన కోమాలోకి వెళ్లారని మరికొంతమంది  సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వైరల్ చేశారు. ఇక ఆయన చనిపోయారంటూ వచ్చిన పుకార్లపౌ  ఇటీవలే ఆయన సతీమణి స్పందించారు. ఓ వీడియో ద్వారా ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. 

 

నెట్టింగ ఆయన ఫోటో చూసిన అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇక విజయ్ కాంత్ గురించి తమిళ సెలబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి స్టార్ హీరోలు ఆరా తీస్తున్నారు. విజయ్ కాంత్ భార్యకు ఫోన్ చేసి.. ధైర్యం చెపుతున్నారు. తాజాగా విజయ్ కాంత్ అనారోగ్యంపై తమిళ స్టార్ హీరో సూర్య స్పందించారు. విజయ్ కాంత్ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన సతీమణికి ఫోన్ చేసి విజయ్ కాంత్ ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు సూర్య. అలాగే సోషల్ మీడియాలో సూర్య ఓ పోస్ట్ షేర్ చేశాడు.  అన్న విజయకాంత్ కోలుకోవాలని ప్రార్థించే కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయి. ఆయన పూర్తిగా కోలుకుంటారు. అని రాసుకొచ్చారు సూర్య.

PREV
click me!

Recommended Stories

Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్