రజనీ, కమల్‌, షారూఖ్‌లపై `కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ కీలక వ్యాఖ్యలు.. వైరల్‌

Published : Apr 10, 2021, 09:23 AM IST
రజనీ, కమల్‌, షారూఖ్‌లపై `కేజీఎఫ్‌` స్టార్‌ యష్‌ కీలక వ్యాఖ్యలు.. వైరల్‌

సారాంశం

`కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా యష్‌ మీడియాతో ముచ్చటించారు. ఓ ఇంటర్వూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, యూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌లపై ప్రశంసలు కురిపించారు. 

యష్‌.. `కేజీఎఫ్‌` చిత్రంతో ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయ్యాడు. ఈ సినిమా ఊహించిన విధంగా సంచలన విజయం సాధించింది. దీంతో నేషనల్‌ వైడ్‌గా యష్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆయన `కేజీఎఫ్‌2`తో రాబోతున్నారు. ఈ సినిమా జులై 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా యష్‌ మీడియాతో ముచ్చటించారు. ఓ ఇంటర్వూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, యూనివర్సల్‌ యాక్టర్‌ కమల్‌ హాసన్‌, బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌లపై ప్రశంసలు కురిపించారు. 

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌, షారూఖ్‌ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారని ప్రశ్నించగా, రజనీకాంత్‌ దేవుడు అని, మా తలైవా అని,  కమల్‌ సర్‌ నటనకు భగవద్గీత అని, షారూఖ్‌ ఖాన్‌ గొప్ప మేధావి అని చెప్పాడు. వారి గురించి ఒక్కమాటలో వారేంటో చెప్పేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. బాలీవుడ్‌లో ఎవరితో కలిసి నటించాలని ఉందన్న ప్రశ్నకు నవాజుద్దీన్‌ సిద్దిఖీ చెప్పాడు.  ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇక ప్రస్తుతం యష్‌ నటిస్తున్న `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2`కి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి భాగం సౌత్‌తోపాటు నార్త్ లో కూడా విడుదలై ఏకంగా రూ.360కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు మార్కెట్‌ మరింతగా పెరిగింది. ఇది ఇంకా ఎలాంటి సంచలనాలు క్రియేట్‌ చేస్తుందో అని చూడాలి.  ఈ సినిమాతో యష్‌ సూపర్‌ స్టార్‌గా ఎదుగుతాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Priyanka Mohan : నన్ను తొక్కేయాలని చూశారు.. ఇండస్ట్రీపై ప్రియాంక మోహన్ సంచలన వ్యాఖ్యలు
Karthika Deepam 2 Today Episode: దీపను ఊహించని విధంగా చంపుతానన్న జ్యో- దాసు, దశరథ షాక్-శ్రీధర్ డౌట్