చిక్కుల్లో కెజిఎఫ్ స్టార్ యష్... నోటీసులు పంపిన అధికారులు!

Published : Jan 14, 2021, 05:47 PM IST
చిక్కుల్లో కెజిఎఫ్ స్టార్ యష్... నోటీసులు పంపిన అధికారులు!

సారాంశం

సాధారణంగా టీజర్ అయినా, ట్రైలర్ అయినా సినిమాలో మాదిరి ఎవరైనా పొగతాగుతున్న సమయాలలో యాంటీ టొబాకో కాషన్ ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే కెజిఎఫ్ 2 టీజర్ లో యష్ పొగతాగుతున్న సమయంలో ఆ కాషన్ డిస్ప్లే చేయలేదు. ఈ విషయంపై హీరో యష్ ని వివరణ కోరుతూ బెంగుళూరు యాంటీ టొబాకో సెల్ అధికారులు నోటీసులు పంపారు.   

పాన్ ఇండియా స్టార్ యష్ లీగల్ ట్రబుల్స్ ఎదుర్కొంటున్నారు. కర్ణాకట అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.  విషయంలోకి వెళితే ఈనెల 8న యష్ బర్త్ డే కానుకగా కెజిఎఫ్ 2 టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ లో ఓ సన్నివేశంలో యష్ మెషీన్ గన్ తో వాహనాలను ధ్వంసం చేస్తాడు.  కాల్పులతో వేడెక్కిన గన్ గొట్టంపై సిగరెట్ ని స్టైలిష్ గా వెలిగించుకోగా యష్, ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. ఐతే ఈ సన్నివేశం ప్రదర్శన సమయంలో చిత్ర యూనిట్ కొన్ని నియమాలు పాటించలేదు. 

సాధారణంగా టీజర్ అయినా, ట్రైలర్ అయినా సినిమాలో మాదిరి ఎవరైనా పొగతాగుతున్న సమయాలలో యాంటీ టొబాకో కాషన్ ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే కెజిఎఫ్ 2 టీజర్ లో యష్ పొగతాగుతున్న సమయంలో ఆ కాషన్ డిస్ప్లే చేయలేదు. ఈ విషయంపై హీరో యష్ ని వివరణ కోరుతూ బెంగుళూరు యాంటీ టొబాకో సెల్ అధికారులు నోటీసులు పంపారు. 

ఇదిలా ఉంటే కెజిఎఫ్ 2 టీజర్ వ్యూస్ లో దుమ్ము రేపింది. విడుదలైన 24గంటల్లో 78 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ టీజర్, రెండు రోజుల వ్యవధిలోనే 100 మిలియన్ వ్యూస్ కి చేరుకుంది. ఇప్పటివరకు కెజిఎఫ్ 2 టీజర్ 147 మిలియన్ వ్యూస్ రాబట్టినట్లు సమాచారం. దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి పార్ట్ కి మించి కెజిఎఫ్ 2 తెరకెక్కించారు. సమ్మర్ కానుకగా కెజిఎఫ్ 2 విడుదల కానున్నట్లు సమాచారం అందుతుంది. 
 
PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు